Telugu Global
National

జగన్‌ టార్గెట్‌ గా... బీజేపీ వైఖరి మారిందా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి దూసుకురావాలని యోచిస్తున్న బీజేపీకి.. ఇప్పుడు ఆ పార్టీలోని నాయకుల దుందుడుకు చర్యలతో కావాల్సినంత హైప్ వస్తోంది. ఏపీ బీజేపీ నేతలు కేంద్రంలో అధికారం ఉంది కదా అని హాట్ కామెంట్స్, హెచ్చరికలతో కాకపుట్టిస్తున్నారు. తాజాగా జగన్ తీరుపై బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి హాట్ కామెంట్ చేశారు. జగన్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా రాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినా ఇంకా సీఎం […]

జగన్‌ టార్గెట్‌ గా... బీజేపీ వైఖరి మారిందా?
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి దూసుకురావాలని యోచిస్తున్న బీజేపీకి.. ఇప్పుడు ఆ పార్టీలోని నాయకుల దుందుడుకు చర్యలతో కావాల్సినంత హైప్ వస్తోంది. ఏపీ బీజేపీ నేతలు కేంద్రంలో అధికారం ఉంది కదా అని హాట్ కామెంట్స్, హెచ్చరికలతో కాకపుట్టిస్తున్నారు.

తాజాగా జగన్ తీరుపై బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి హాట్ కామెంట్ చేశారు. జగన్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా రాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినా ఇంకా సీఎం జగన్ మాత్రం పదే పదే ప్రత్యేక హోదా గురించి మాట్లాడడంపై పురంధేశ్వరి ఫైర్ అయ్యారు.

ఏపీ అభివృద్ధికి ప్యాకేజీలు, నిధులు కోరాల్సింది పోయి జగన్ కూడా చంద్రబాబు లాగేనే ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదంటూ పురంధేశ్వరి మండిపడ్డారు. టీడీపీ చేసిన తప్పులనే వైసీపీ చేస్తోందని.. ప్రజలను మభ్య పెడుతూ బీజేపీపై విష ప్రచారం చేస్తున్నారని పురంధేశ్వరి మండిపడ్డారు.

టీడీపీకి బుద్ధి చెప్పినట్టే వైసీపీకి కూడా ప్రజలు బుద్ది చెబుతారని జగన్ తీరు మార్చుకోవాలంటూ పురంధేశ్వరీ ఘాటు హెచ్చరికలు పంపారు.

కేంద్రం దుగ్గరాజపట్నం పోర్ట్ ను అభివృద్ధి చేస్తానన్నా జగన్ మొండిగా రామాయపట్నం కోరడం కరెక్ట్ కాదంటూ విమర్శించారు.

ఇక సీఎం కేసీఆర్ తో జగన్ స్నేహంపై కూడా పురంధేశ్వరి విరుచుకుపడ్డారు. ఏపీ హక్కులకు భంగం కలిగించేలా గోదావరి జలాల పంపకాలపై జగన్ తెలంగాణకు మేలు చేసేలా వ్యవహరిస్తున్నారని .. ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు.

మొత్తంగా ఏపీలో అధికారంలో ఉన్న జగన్ నే టార్గెట్ చేసి బీజేపీ ముందుకెళ్తుండడం సంచలనంగా మారింది. మొన్నటి వరకు టీడీపీని టార్గెట్ చేసి ఇప్పుడు వైసీపీని కూడా వదలకుండా వెళ్తున్న బీజేపీ వ్యవహారశైలి హాట్ టాపిక్ గా మారింది.

First Published:  2 Aug 2019 6:45 AM GMT
Next Story