Telugu Global
NEWS

బర్మింగ్ హామ్ టెస్ట్ తొలిరోజునే హోరాహోరీ

చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్లు, పోరాడిన స్టీవ్ స్మిత్ ఆస్ట్ర్రేలియా 284 పరుగులకు ఆలౌట్ ఇంగ్లండ్- ఆస్ట్ర్రేలియా జట్ల యాషెస్ సిరీస్ తొలిటెస్ట్ తొలిరోజు ఆట హోరాహోరీగా సాగింది. ఆతిథ్య ఇంగ్లండ్ విజయాల అడ్డా బర్మింగ్ హామ్ స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈ ఐదురోజుల మ్యాచ్ తొలిరోజున ఆస్ట్ర్రేలియా కెప్టెన్ టిమ్ పెయిన్ ముందుగా టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకొన్నాడు. అయితే…ఇంగ్లండ్ ఓపెనింగ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్ చెలరేగిపోడంతో కంగారూ ఓపెనర్లు బాన్ క్రాఫ్ట్, వార్నర్, వన్ […]

బర్మింగ్ హామ్ టెస్ట్ తొలిరోజునే హోరాహోరీ
X
  • చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్లు, పోరాడిన స్టీవ్ స్మిత్
  • ఆస్ట్ర్రేలియా 284 పరుగులకు ఆలౌట్

ఇంగ్లండ్- ఆస్ట్ర్రేలియా జట్ల యాషెస్ సిరీస్ తొలిటెస్ట్ తొలిరోజు ఆట హోరాహోరీగా సాగింది. ఆతిథ్య ఇంగ్లండ్ విజయాల అడ్డా బర్మింగ్ హామ్ స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈ ఐదురోజుల మ్యాచ్ తొలిరోజున ఆస్ట్ర్రేలియా కెప్టెన్ టిమ్ పెయిన్ ముందుగా టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకొన్నాడు.

అయితే…ఇంగ్లండ్ ఓపెనింగ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్ చెలరేగిపోడంతో కంగారూ ఓపెనర్లు బాన్ క్రాఫ్ట్, వార్నర్, వన్ డౌన్ ఉస్మాన్ క్వాజా ఒకరి వెంట ఒకరుగా అవుటయ్యారు.

బ్రాడ్ 4, వోక్స్ 3 వికెట్లు…

ఆస్ట్ర్రేలియా టాపార్డర్లో వార్నర్ 2, బాన్ క్రాఫ్ట్ 8, వన్ డౌన్ క్వాజా 13 పరుగులకు ఒకరి వెనుక ఒకరుగా అవుట్ కావడంతో ఇంగ్లండ్ పైచేయి సాధించింది.

రెండోడౌన్లో బ్యాటింగ్ కు దిగిన మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఎనలేని ఏకాగ్రతకు తన అనుభవాన్ని జోడించి పోరాటం కొనసాగించాడు. ట్రావిడ్ హెడ్ తో కలసి 4వ వికెట్ కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం, సిడిల్ తో కలసి 9వ వికెట్ కు కీలక భాగస్వామ్యాలు నమోదు చేయడం ద్వారా తనజట్టు స్కోరు 250కి చేరడంలో ప్రధానపాత్ర వహించాడు.

స్మిత్ మొత్తం 184 బాల్స్ ఎదుర్కొని 9 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో ఫైటింగ్ సెంచరీ పూర్తి చేశాడు. అంతేకాదు…10వ వికెట్ కు లయన్ తో కలసి 54 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ భాగస్వామ్యం సాధించడంతో…ఆస్ట్ర్రేలియా అనూహ్యంగా పుంజుకోగలిగింది. 80.4 ఓవర్లలో 284 పరుగుల స్కోరు సాధించగలిగింది.

స్మిత్ 219 బాల్స్ లో 16 బౌండ్రీలు, 2 సిక్సర్ల తో 144 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్ 86 పరుగులిచ్చి 5 వికెట్లు, క్రిస్ వోక్స్ 53 పరుగులిచ్చి 3 వికెట్లు, స్టోక్స్ , మోయిన్ అలీ చెరో వికెట్ పడగొట్టారు.

First Published:  1 Aug 2019 11:16 PM GMT
Next Story