Telugu Global
Cinema & Entertainment

రెండు సినిమాలు.... కానీ ఒకే లుక్...!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం చిత్రబృందం కాకినాడలో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టింది. కాకినాడలోని షిప్పింగ్ యార్డు వద్ద సినిమా షూటింగ్ జరుగుతోంది. మరోవైపు ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత బన్ని సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం సుకుమార్ […]

రెండు సినిమాలు.... కానీ ఒకే లుక్...!
X

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.

ప్రస్తుతం చిత్రబృందం కాకినాడలో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టింది. కాకినాడలోని షిప్పింగ్ యార్డు వద్ద సినిమా షూటింగ్ జరుగుతోంది.

మరోవైపు ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత బన్ని సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం సుకుమార్ బన్నీ ని కలిసి సినిమా బౌండ్ స్క్రిప్ట్ ని అందజేసినట్లు తెలుస్తోంది. మరోవైపు అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ సినిమాని కూడా ఓకే చేసాడు.

అయితే ఈ రెండు సినిమాల షూటింగ్ ని ఒకేసారి మొదలు పెట్టాలని బన్నీ ప్లాన్ చేస్తున్నారట. మరొక రెండు నెలలలో త్రివిక్రమ్ సినిమా షూటింగ్ పూర్తి కాబోతోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత సుకుమార్ మరియు వేణు శ్రీరామ్ ల సినిమాలు షూటింగ్ ఒకేసారి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

అయితే తన ప్రతి సినిమాలో బన్నీ సరికొత్త లుక్ తో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాడు. కానీ ఈ రెండు సినిమాల షూటింగ్ ఒకేసారి చేయబోతున్నాడు అంటే రెండు సినిమాల్లోనూ ఒకే లుక్ తో కనిపిస్తాడని అర్థం చేసుకోవచ్చు.

First Published:  2 Aug 2019 1:00 AM GMT
Next Story