Telugu Global
Cinema & Entertainment

ఓయూ స్టూడెంట్ లీడర్ జార్జి రెడ్డి బయోపిక్...

ఇప్పటికే సినీ సెలబ్రిటీల, పొలిటీషియన్స్, క్రీడాకారుల జీవిత చరిత్రల ఆధారంగా బోలెడు బయోపిక్ లు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఒక స్టూడెంట్ లీడర్ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు ఒక దశాబ్దం పాటు ఓయూ స్టూడెంట్ లీడర్ గా ఎన్నో పోరాటం చేసిన జార్జ్ రెడ్డి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. కానీ అలాంటి వ్యక్తి జీవితం గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఇప్పుడు అతని బయోపిక్ తెరకెక్కుతుంది. జీవన్ […]

ఓయూ స్టూడెంట్ లీడర్ జార్జి రెడ్డి బయోపిక్...
X

ఇప్పటికే సినీ సెలబ్రిటీల, పొలిటీషియన్స్, క్రీడాకారుల జీవిత చరిత్రల ఆధారంగా బోలెడు బయోపిక్ లు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఒక స్టూడెంట్ లీడర్ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు ఒక దశాబ్దం పాటు ఓయూ స్టూడెంట్ లీడర్ గా ఎన్నో పోరాటం చేసిన జార్జ్ రెడ్డి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. కానీ అలాంటి వ్యక్తి జీవితం గురించి చాలా తక్కువ మందికే తెలుసు.

ఇప్పుడు అతని బయోపిక్ తెరకెక్కుతుంది. జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘వంగవీటి’ ఫేమ్ సందీప్ కుమార్ జార్జి రెడ్డి పాత్రలో కనిపించబోతున్నాడు.

తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. మైక్ లో నినాదం చేస్తున్నట్టు అచ్చం జార్జ్ రెడ్డి లా సందీప్ కుమార్ కనిపిస్తున్నాడు.

”జార్జ్ రెడ్డి”, ”ఎ మాన్ ఆఫ్ యాక్షన్” అనే క్యాప్షన్ తో ఈ పోస్టర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. పోస్టర్ తోనే ఆకట్టుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది.

మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. సత్యదేవ్, శత్రు, నవీన్ బెతిగంటి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

First Published:  1 Aug 2019 11:01 AM GMT
Next Story