Telugu Global
National

ఒక్క ఎమ్మెల్యేతో.... అధికారంలోకి రావడం సాధ్యమేనా?

జమిలి ఎన్నికలతో దేశవ్యాప్తంగా బీజేపీయే గెలిచేటట్టు ప్లాన్ చేస్తున్న కమళదళం చూపు ఇప్పుడు తెలంగాణపై పడింది. ఇక్కడ సీరియస్ గా ప్రయత్నాలు ప్రారంభించేసింది. అమిత్ షా ఫుల్ ఫోకస్ పెట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో అధికారంలోకి రావాలని స్కెచ్ గీస్తోంది. అయితే…. వీలైతే వచ్చే ఎన్నికల లోగానే తెలంగాణలో అధికారంలోకి రావాలని కూడా బీజేపీ ప్లాన్‌ చేస్తోందట. తాజాగా బీజేపీ బాంబు పేల్చింది. కేసీఆర్ పై అసంతృప్తితో అసమ్మతిగా ఉన్న కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో […]

ఒక్క ఎమ్మెల్యేతో.... అధికారంలోకి రావడం సాధ్యమేనా?
X

జమిలి ఎన్నికలతో దేశవ్యాప్తంగా బీజేపీయే గెలిచేటట్టు ప్లాన్ చేస్తున్న కమళదళం చూపు ఇప్పుడు తెలంగాణపై పడింది. ఇక్కడ సీరియస్ గా ప్రయత్నాలు ప్రారంభించేసింది. అమిత్ షా ఫుల్ ఫోకస్ పెట్టారు.

2023 అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో అధికారంలోకి రావాలని స్కెచ్ గీస్తోంది.

అయితే…. వీలైతే వచ్చే ఎన్నికల లోగానే తెలంగాణలో అధికారంలోకి రావాలని కూడా బీజేపీ ప్లాన్‌ చేస్తోందట.

తాజాగా బీజేపీ బాంబు పేల్చింది. కేసీఆర్ పై అసంతృప్తితో అసమ్మతిగా ఉన్న కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని.. వారు ఎప్పుడైనా బీజేపీలో చేరవచ్చని.. వీరితోపాటు కాంగ్రెస్, టీడీపీ నేతలు బీజేపీలో చేరుతారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

నిజానికి అనేక ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డ నలభై మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కేంద్ర నిఘా విభాగాలు గుర్తించాయట. ఇప్పుడు వాళ్ళకు బీజేపీ నాయకులు బేరం పెట్టారని కొందరంటున్నారు. బీజేపీ లోకి వస్తారా? లేక జైలుకు పోతారా? అని ఆఫర్‌ ఇచ్చినట్లు సమాచారం. గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళు బీజేపీలోకే వెళతారని కేసీఆర్‌ కూడా భావిస్తున్నారట.

టీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలో ఉంది. వచ్చే సారి కేసీఆర్ టికెట్లు ఇవ్వడం కష్టమేనన్న అనుమానంతో కొందరు ఉన్నారట.. అంతేకాదు.. రెండు సార్లు గెలిచిన టీఆర్ఎస్ మూడోసారి గెలుస్తుందో లేదోనన్న సంశయాలు కొందరిలో ఉన్నాయట. ఇప్పుడు వారిని బీజేపీలోకి లాగే పనిలో కమళదళం ఉంది.

ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కుదేలైంది. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తిగా అందరూ బీజేపీనే చూస్తున్నారు. అందుకే టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా గళమెత్తేవారిని బీజేపీలో చేర్చుకోవాలని యోచిస్తోంది. పట్టుబడితే వదలని బీజేపీ…. మరి బలమైన కేసీఆర్ ను తట్టుకొని నిలబడుతుందా లేదా అన్నది వేచిచూడాలి.

First Published:  1 Aug 2019 10:47 AM GMT
Next Story