Telugu Global
NEWS

వర్షాలే... వర్షాలు... పెరుగుతున్న గోదావరి నీటిమట్టం!

దేశంలో వర్షాలే వర్షాలు. గడచిన మూడు రోజులుగా దేశంలో దాదాపు అన్ని ప్రాంతాలలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దేశంలోని అన్ని నదులు పొంగిపొరలుతున్నాయి. ముఖ్యంగా గోదావరి నదిని వరద నీరు ముంచెత్తుతోంది. గుజరాత్, బిహర్, మహరాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్నాటకలతో పాటు తెలుగు రాష్ట్ర్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల్లో కూడా వానలు ముంచెత్తుతున్నాయి. గుజరాత్ లోని వడోదరాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని స్కూళ్లు, కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. ముంబాయిలో గత […]

వర్షాలే... వర్షాలు... పెరుగుతున్న గోదావరి నీటిమట్టం!
X

దేశంలో వర్షాలే వర్షాలు. గడచిన మూడు రోజులుగా దేశంలో దాదాపు అన్ని ప్రాంతాలలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దేశంలోని అన్ని నదులు పొంగిపొరలుతున్నాయి. ముఖ్యంగా గోదావరి నదిని వరద నీరు ముంచెత్తుతోంది. గుజరాత్, బిహర్, మహరాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్నాటకలతో పాటు తెలుగు రాష్ట్ర్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల్లో కూడా వానలు ముంచెత్తుతున్నాయి.

గుజరాత్ లోని వడోదరాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని స్కూళ్లు, కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. ముంబాయిలో గత నెలలో ప్రారంభమైన భారీ వర్షాలు ఇంకా వదలలేదు. దీంతో ఇక్కడ కూడా జనజీవనం స్థంబిస్తోంది. జమ్మూ కాశ్మీర్ ను కూడా భారీ వర్షాలు వదలడం లేదు. ఇక్కడ కూడా భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు అమర్ నాథ్ యాత్రను కేంద్రం నిలిపివేసింది.

తెలుగు రాష్ట్ర్రాలలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాజధానితో సహా అన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణలోని అన్ని నదులలోనూ వరద నీరు వచ్చి చేరుతోంది. అయితే రైతులు వ్యవసాయ పనులకు మాత్రం ఈ వర్షాలు ఎంతో ఉపకరిస్తున్నాయి. తెలుగు రాష్ట్ర్రాలలో ప్రధాన నదులైన క్రిష్ణ, గోదావరి నదులు వరద నీటితో కళకళలాడుతున్నాయి.

తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి నది నీటిమట్టం 9.6 అడుగులకు చేరుకుంది. ఇక తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 38.90 అడుగులకు చేరుకుంది. దీంతో ఇక్కడ అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీశైలం వద్ద క్రిష్ణ నది నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. ఇక్కడి నుంచి జూరాలకు నీటిని వదులుతున్నారు. జురాల ప్రాజెక్టుకు భారీగా నీరు చేరడంతో 24 గేట్లను ఎత్తివేశారు. దక్షిణాది రాష్ట్ర్రాలైన కేరళ, తమిళనాడు, కర్నాటకల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ వర్ఫాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

First Published:  1 Aug 2019 1:20 AM GMT
Next Story