Telugu Global
NEWS

కలెక్టర్లూ.... గ్రామాలను మీ బిడ్డలు అనుకోండి

“కలెక్టర్లు గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మీ జిల్లాలో ఉన్న గ్రామాలే మీ తొలి బిడ్డలుగా భావించాలి” ఇదీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివిధ జిల్లాల కలెక్టర్లకు ఇచ్చిన సందేశం. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని, వేల సంఖ్యలో వస్తున్న విజ్ఞప్తులే […]

కలెక్టర్లూ.... గ్రామాలను మీ బిడ్డలు అనుకోండి
X

“కలెక్టర్లు గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మీ జిల్లాలో ఉన్న గ్రామాలే మీ తొలి బిడ్డలుగా భావించాలి” ఇదీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివిధ జిల్లాల కలెక్టర్లకు ఇచ్చిన సందేశం.

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని, వేల సంఖ్యలో వస్తున్న విజ్ఞప్తులే ఇందుకు తార్కాణమని సీఎంతెలిపారు. రాష్ట్రంలో అవినీతి లేని పాలన అందించాలన్నదే తన లక్ష్యమని, అందుకు అనుగుణంగా ప్రజల నుంచి స్పందన వస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

“గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అవినీతిని చూసి చూసి ప్రజలు విసిగిపోయారు. మనం అవినీతి రహిత పాలన అందిస్తున్నామని చాలా ఆశగా ఉన్నారు. వారి ఆశలు నెరవేర్చాల్సిన బాధ్యత మనపై ఉంది” అని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.

రేషన్ కార్డుల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వారికి 72 గంటలలోగా రేషన్ కార్డు అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని సీఎం స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలంటే క్షేత్రస్థాయిలో వారికి అన్నీ సక్రమంగా అందాలని, గ్రామ సచివాలయాలను దేవాలయాలుగా భావించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ముఖ్యమంత్రి తెలిపారు.

సెప్టెంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇసుక పాలసీని అమల్లోకి తీసుకు వస్తున్నామని, ప్రస్తుతం ఇసుక లభ్యత మరింత పెరిగేలా చొరవ తీసుకోవాలని సూచించారు. “ఇసుక ర్యాంపుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి. ఇసుక ర్యాంపుల సంఖ్యను మరింత పెంచండి” అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.

మధ్యాహ్న భోజన పథకంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని, పిల్లలకు సరైన సమయానికి భోజనం అందించే బాధ్యత కలెక్టర్లదేనని ఆయన తెలిపారు. “గత ప్రభుత్వ హయాంలో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు బిల్లులు ఇచ్చేవారు కాదు. దీంతో వారు కూడా ఈ పథకం పై శ్రద్ధ పెట్టేవారు కాదు. ఇక ముందు అలా జరగడానికి వీల్లేదు. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సకాలంలో బిల్లులు చెల్లించాల్సిందే” అని సీఎం ఆదేశించారు.

మధ్యాహ్న భోజన నిర్వహణ బాధ్యత కలెక్టర్లదేనని, ఎక్కడ ఎలాంటి లోపం వచ్చినా తాను కలెక్టర్ లనే బాధ్యులుగా చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు.

First Published:  31 July 2019 12:00 AM GMT
Next Story