Telugu Global
Cinema & Entertainment

వెంకీ-తరుణ్ ల సినిమా పట్టాలెక్కేనా?

‘పెళ్లి చూపులు’ సినిమా తర్వాత హీరోగా విజయ్ దేవరకొండ ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో ఆ సినిమాకి దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ కూడా అంతే పాపులర్ అయ్యాడు. అయితే మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తరుణ్ భాస్కర్ తన తరువాతి సినిమాలతో మాత్రం మంచి విజయాన్ని సాధించలేకపోయాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది కానీ…. కలెక్షన్ల పరంగా మాత్రం సినిమా అనుకున్నంత […]

వెంకీ-తరుణ్ ల సినిమా పట్టాలెక్కేనా?
X

‘పెళ్లి చూపులు’ సినిమా తర్వాత హీరోగా విజయ్ దేవరకొండ ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో ఆ సినిమాకి దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ కూడా అంతే పాపులర్ అయ్యాడు.

అయితే మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తరుణ్ భాస్కర్ తన తరువాతి సినిమాలతో మాత్రం మంచి విజయాన్ని సాధించలేకపోయాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది కానీ…. కలెక్షన్ల పరంగా మాత్రం సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది.

ఈ మధ్యనే తరుణ్ భాస్కర్ ‘ఫలక్ నుమా దాస్’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. కానీ ఆ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు.

గత కొంతకాలంగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వెంకటేష్ హీరోగా తరుణ్ భాస్కర్ ఒక సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపించాయి. కానీ దీని గురించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా బయటకు రాలేదు.

ప్రస్తుతం వెంకటేష్ ‘వెంకీ మామ’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ‘దే దే ప్యార్ దే’ సినిమా రీమేక్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. మరి తరుణ్ భాస్కర్ ఈ రీమేక్ కి దర్శకత్వం వహిస్తాడా లేక సొంత కథతో వెంకీ ని హీరోగా పెట్టి సినిమా తీస్తాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

First Published:  30 July 2019 11:59 PM GMT
Next Story