Telugu Global
NEWS

శాసనసభ సమావేశాలు చారిత్రాత్మకం....

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరు చారిత్రాత్మకమని, ప్రజాప్రతినిధిగా, మంత్రిగా ఎంతో అనుభవం ఉన్న తాను ఇలాంటి సమావేశాలు ఎప్పుడూ చూడలేదని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత స్పీకర్ విలేకరులతో మాట్లాడారు. “బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరు నాకు అత్యంత సంతృప్తిని కలిగించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభలో వ్యవహరించిన తీరు అమోఘం… అద్భుతం” అని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆనందం వ్యక్తం చేశారు. […]

శాసనసభ సమావేశాలు చారిత్రాత్మకం....
X

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరు చారిత్రాత్మకమని, ప్రజాప్రతినిధిగా, మంత్రిగా ఎంతో అనుభవం ఉన్న తాను ఇలాంటి సమావేశాలు ఎప్పుడూ చూడలేదని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత స్పీకర్ విలేకరులతో మాట్లాడారు.

“బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరు నాకు అత్యంత సంతృప్తిని కలిగించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభలో వ్యవహరించిన తీరు అమోఘం… అద్భుతం” అని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆనందం వ్యక్తం చేశారు.

ఈసారి బడ్జెట్ సమావేశాలు 14 రోజుల పాటు జరిగాయని, ప్రజల సమస్యలపై అధికార, ప్రతిపక్ష సభ్యులు విస్తృతంగా చర్చించారని స్పీకర్ తెలిపారు.

“14 రోజులలో 78 గంటల 35 నిమిషాల సేపు సభ జరిగింది. చాలా తక్కువగానే సమయం వృధా అయింది. ఇది చారిత్రక పరిణామం” అని స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు.

బడ్జెట్ సమావేశాలలో అత్యంత కీలకమైన 20 బిల్లులు సభ ముందుకు వచ్చాయని, ఈ బిల్లులపై విస్తృతంగా చర్చ జరిగిందని, సభ 19 బిల్లులను ఆమోదించిందని స్పీకర్ అన్నారు. వివిధ అంశాలపై చర్చలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహార సరళి తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, వివిధ అంశాలపై ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు ఆశ్చర్యానికి గురి చేసిందని స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు.

“అన్ని విషయాల పైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్పష్టత ఉంది. మంచి అవగాహన ఉంది. అందుకే ఏ విషయంలోనూ ఆయన రాజీపడకుండానే మాట్లాడారు. అధికారపక్షం ఒక్కటే మాట్లాడడం కాదు. వివిధ బిల్లులపై మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు కూడా ఎక్కువ సమయం ఇచ్చారు. ఇది గతంలో నేను ఎప్పుడూ చూడలేదు” అని స్పీకర్ అన్నారు.

తొలిసారి స్పీకర్ స్థానంలో కూర్చున్న తాను సభ నిర్వహణపై కొంత ఆందోళన గానే ఉన్నా…. సభ నడిచిన తీరు చూసి ఎంతో ఆనందించానని ఆయన తెలిపారు.

First Published:  30 July 2019 11:05 PM GMT
Next Story