Telugu Global
Cinema & Entertainment

సైమా లో సందడి చేయనున్న చిరంజీవి, మోహన్ లాల్

దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమ లో ని నాలుగు భాషల్లోని ప్రతిభ గల నటుల్ని, టెక్నీషియన్ల ని గుర్తించి వారికి అవార్డ్స్ ఇస్తూ వస్తుంది సైమా. 2012 లో మొదలైన ఈ సైమా ఉత్సవం ఈ సారి 2019 లో కతార్ లో జరగనుంది. ఆగస్టు 15, 16 తేదీలలో ఈ అవార్డ్స్ ఈవెంట్ ఘనం గా జరగనుంది. అయితే ఈ అవార్డ్స్ ఈవెంట్ కి సంబంధించి ఇప్పటికే పోల్స్ ప్రారంభం అయ్యాయి. ఈవెంట్ కి […]

సైమా లో సందడి చేయనున్న చిరంజీవి, మోహన్ లాల్
X

దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమ లో ని నాలుగు భాషల్లోని ప్రతిభ గల నటుల్ని, టెక్నీషియన్ల ని గుర్తించి వారికి అవార్డ్స్ ఇస్తూ వస్తుంది సైమా.

2012 లో మొదలైన ఈ సైమా ఉత్సవం ఈ సారి 2019 లో కతార్ లో జరగనుంది. ఆగస్టు 15, 16 తేదీలలో ఈ అవార్డ్స్ ఈవెంట్ ఘనం గా జరగనుంది.

అయితే ఈ అవార్డ్స్ ఈవెంట్ కి సంబంధించి ఇప్పటికే పోల్స్ ప్రారంభం అయ్యాయి. ఈవెంట్ కి సంబందించిన ప్రమోషన్స్ కూడా ఘనం గా జరుగుతున్నాయి… అయితే ఈ సారి ఈవెంట్ కి సంబంధించి ఒక ఆసక్తికర ప్రకటన చేసింది సైమా టీమ్.

15 వ తేదీ న తెలుగు మరియు కన్నడ సినిమా ప్రముఖుల్ని సత్కరిస్తున్నట్టు, ఆ రోజుకి గెస్ట్ ఆఫ్ హానర్ కింద మెగా స్టార్ చిరంజీవి ని ఆహ్వానించారట.

అలాగే 16 వ తేదీ న మలయాళ మరియు కన్నడ సినిమా ప్రముఖుల్ని సత్కరిస్తున్నట్టు, ఆ రోజుకి గెస్ట్ ఆఫ్ హానర్ కింద మోహన్ లాల్ ని ఆహ్వానించారట. ఇద్దరినీ సైమా స్టేజ్ మీద సైమా ఘనంగా సత్కరించనుంది కూడా.

ఈ అవార్డ్స్ ఈవెంట్ కి సంబంధించి మిగిలిన వివరాలు త్వరలో తెలియనున్నాయి.

First Published:  31 July 2019 3:52 AM GMT
Next Story