Telugu Global
Cinema & Entertainment

టాలీవుడ్ లో మరో నటుడికి అవమానం

మొన్నటికిమొన్న మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి అవమానకర రీతిలో జగపతిబాబును తప్పించారు. దీనిపై జగపతిబాబు కాస్త హర్ట్ అయ్యాడు కూడా. మీడియాలో ఇది 2 రోజుల పాటు హెడ్ లైన్స్ గా కూడా నలిగింది. ఆ ఎపిసోడ్ ఓ కొలిక్కి వచ్చిందనుకునేలోపే ఇప్పుడు అలాంటిదే మరో అవమానం టాలీవుడ్ లో బయటపడింది. సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి జగపతిబాబును ఎలాగైతే అవమానకర రీతిలో బయటకు పంపించారో.. బన్నీ-త్రివిక్రమ్ సినిమా నుంచి రావు రమేష్ […]

టాలీవుడ్ లో మరో నటుడికి అవమానం
X

మొన్నటికిమొన్న మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి అవమానకర రీతిలో జగపతిబాబును తప్పించారు. దీనిపై జగపతిబాబు కాస్త హర్ట్ అయ్యాడు కూడా. మీడియాలో ఇది 2 రోజుల పాటు హెడ్ లైన్స్ గా కూడా నలిగింది. ఆ ఎపిసోడ్ ఓ కొలిక్కి వచ్చిందనుకునేలోపే ఇప్పుడు అలాంటిదే మరో అవమానం టాలీవుడ్ లో బయటపడింది.

సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి జగపతిబాబును ఎలాగైతే అవమానకర రీతిలో బయటకు పంపించారో.. బన్నీ-త్రివిక్రమ్ సినిమా నుంచి రావు రమేష్ ను కూడా అదే విధంగా పంపించారట. అవును.. ఇప్పుడీ సినిమాకు రావు రమేష్ కు సంబంధం లేదు. తను ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు రావు రమేష్ అధికారికంగా ప్రకటించాడు.

సరిలేరు నీకెవ్వరు సినిమాలో జగపతి బాబు స్థానంలో ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారు. బన్నీ-త్రివిక్రమ్ సినిమాలో రావు రమేష్ స్థానంలో నటుడు హర్షవర్థన్ ను తీసుకున్నారు. రావురమేష్ కంటే ఆ పాత్రకు హర్షవర్థన్ అయితే బాగుంటుందని దర్శకుడు భావించాడట.

మొత్తమ్మీద ఇండస్ట్రీలో ఒకేసారి ఇలా ఒకే విధమైన ఘటనలు జరగడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

First Published:  31 July 2019 7:00 AM GMT
Next Story