Telugu Global
Cinema & Entertainment

నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో చిరంజీవి సినిమా

ప్రస్తుతం ఇండస్ట్రీలో జోరుగా నడుస్తున్న పుకారు ఇదొక్కటే. కొరటాల దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రాబోతున్న ఈ సినిమాను నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారట. సినిమా సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పూర్తిగా నక్సలిజం బ్యాక్ డ్రాప్ ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, చిరంజీవి ఈ సినిమాలో రెండు షేడ్స్ లో కనిపిస్తాడట. 30 ఏళ్ల గోవింద్ అనే యువకుడి పాత్రలో చిరంజీవి కనిపించబోతున్నాడట. ఈ క్యారెక్టర్ కోసమే ఆ మధ్య వైజాగ్ వెళ్లి […]

నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో చిరంజీవి సినిమా
X

ప్రస్తుతం ఇండస్ట్రీలో జోరుగా నడుస్తున్న పుకారు ఇదొక్కటే. కొరటాల దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రాబోతున్న ఈ సినిమాను నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారట.

సినిమా సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పూర్తిగా నక్సలిజం బ్యాక్ డ్రాప్ ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, చిరంజీవి ఈ సినిమాలో రెండు షేడ్స్ లో కనిపిస్తాడట.

30 ఏళ్ల గోవింద్ అనే యువకుడి పాత్రలో చిరంజీవి కనిపించబోతున్నాడట. ఈ క్యారెక్టర్ కోసమే ఆ మధ్య వైజాగ్ వెళ్లి కాస్త సన్నబడ్డాడట చిరంజీవి. ఇక ఇదే సినిమాలో 45 ఏళ్ల ఆచార్య అనే మధ్యవయష్కుని పాత్ర కూడా ఉందట. ఈ రెండు పాత్రల్ని చాలా పవర్ ఫుల్ గా రూపొందించాడట దర్శకుడు కొరటాల శివ.

కొరటాల శివ సినిమాల్లో బలమైన సందేశం ఉంటుంది. చిరంజీవి సినిమా కూడా అందుకు అతీతం కాదు. ప్రస్తుతానికైతే ఫిలిం సర్కిల్స్ లో బలంగా వినిపిస్తున్న గాసిప్ ఇదే. దీనిపై ఆగస్ట్ 22న ఓ క్లారిటీ రానుంది. ఆ రోజు చిరంజీవి బర్త్ డే. అదే రోజున ఈ సినిమాను లాంఛ్ చేస్తారనే ప్రచారం సాగుతోంది.

First Published:  31 July 2019 8:00 AM GMT
Next Story