Telugu Global
NEWS

వెధవ హెచ్‌ఎం కోసం ఏపీ మంత్రి లాబీయింగ్ ?

కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం తీరుపై విమర్శలు వస్తున్నాయి. సస్పెండ్ అయిన ఒక హెడ్‌మాస్టర్‌ను ఆయన వెనుకేసుకొస్తున్న తీరు చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. గోనెగండ్ల మండలం పిలిగుండ్లలో హెచ్‌ఎంగా పని చేసిన రంగస్వామి ఆ సమయంలో తోటి టీచర్‌ను లైంగికంగా వేధించాడు. అయితే ఆమె లొంగేందుకు అంగీకరించకపోవడంతో అదే స్కూల్‌లో పనిచేస్తున్న మరో ఉపాధ్యాయుడితో ఆమెకు అక్రమ సంబంధం అంటగట్టాడు. కొందరు విద్యార్థుల ద్వారా మహిళా టీచర్‌పై ఎంఈవోకు ఫిర్యాదు చేయించాడు. విద్యార్థులు ఫిర్యాదు […]

వెధవ హెచ్‌ఎం కోసం ఏపీ మంత్రి లాబీయింగ్ ?
X

కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం తీరుపై విమర్శలు వస్తున్నాయి. సస్పెండ్ అయిన ఒక హెడ్‌మాస్టర్‌ను ఆయన వెనుకేసుకొస్తున్న తీరు చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. గోనెగండ్ల మండలం పిలిగుండ్లలో హెచ్‌ఎంగా పని చేసిన రంగస్వామి ఆ సమయంలో తోటి టీచర్‌ను లైంగికంగా వేధించాడు. అయితే ఆమె లొంగేందుకు అంగీకరించకపోవడంతో అదే స్కూల్‌లో పనిచేస్తున్న మరో ఉపాధ్యాయుడితో ఆమెకు అక్రమ సంబంధం అంటగట్టాడు.

కొందరు విద్యార్థుల ద్వారా మహిళా టీచర్‌పై ఎంఈవోకు ఫిర్యాదు చేయించాడు. విద్యార్థులు ఫిర్యాదు చేస్తున్న దృశ్యాలను సెల్‌ఫోన్లో రికార్డు చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు. అయితే బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో డీఈవో విచారణకు ఆదేశించారు. దాంతో విచారణ బృందం వచ్చి లోతుగా ఆరా తీయగా హెడ్‌మాస్టర్‌ చెబితేనే తాము మహిళా టీచర్‌ గురించి అలా చెప్పామని విద్యార్థులు వివరించారు.

రంగస్వామి అంతా కుట్రపూరితంగానే ఇది చేశారని నివేదిక రావడంతో అతడిపై సస్పెన్షన్‌ వేటు వేశాడు. దాంతో వెంటనే రంగంలోకి దిగిన మంత్రి జయరాం… రంగస్వామిని సస్పెండ్‌ చేయకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని చెప్పినా మంత్రి లెక్క చేయలేదంటున్నారు. దాంతో సస్పెండ్ చేయకుండా పక్కనే ఉన్న మరో గ్రామానికి అతడిని బదిలీ చేశారు.

ఆ బదిలీ కూడా పిలిగుండ్ల గ్రామస్తులు అతడిని గ్రామంలోకి అడుగు పెట్టనివ్వకపోవడంతో మరో దారి లేక మరో గ్రామానికి బదిలీ చేశారు. ఇలా మహిళా టీచర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడడంతో పాటు, ఆమెకు మరొకరితో అక్రమ సంబంధం అంటగట్టేందుకు ప్రయత్నించడం, చివరకు గ్రామస్తుల చేత కూడా చీకొట్టించుకున్న హెచ్‌ఎం రంగస్వామికి మంత్రి సపోర్టు చేయడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు.

First Published:  30 July 2019 8:15 AM GMT
Next Story