Telugu Global
NEWS

తెలుగుదేశానికి ఆగస్టు భయం

రెండు రోజులు. 48 గంటలు. దేనికి అనుకుంటున్నారా..? ఆగస్టు నెల ప్రారంభానికి మిగిలిన గడువు ఇది. మూడున్నర దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి వెన్నులో వణుకు పుట్టిస్తున్న నెల ఆగస్టు. ప్రతిఏటా ఆగస్టు నెల వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ నాయకులలో ఓ గుబులు ప్రారంభమవుతుంది. గడచిన ఐదు సంవత్సరాలలో అధికారంలో ఉన్నామన్న ఆనందంతో పాటు ఆగస్టు నెల వచ్చిందంటే తెలుగు తమ్ముళ్లలో భయం తొణికిసలాడేది. ఏకంగా అధికారాన్ని కోల్పోవడం, పార్టీ నాయకులు ఒక్కరొక్కరే మరో పార్టీలో చేరిపోవడం తెలుగుదేశం […]

తెలుగుదేశానికి ఆగస్టు భయం
X

రెండు రోజులు. 48 గంటలు. దేనికి అనుకుంటున్నారా..? ఆగస్టు నెల ప్రారంభానికి మిగిలిన గడువు ఇది. మూడున్నర దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి వెన్నులో వణుకు పుట్టిస్తున్న నెల ఆగస్టు. ప్రతిఏటా ఆగస్టు నెల వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ నాయకులలో ఓ గుబులు ప్రారంభమవుతుంది.

గడచిన ఐదు సంవత్సరాలలో అధికారంలో ఉన్నామన్న ఆనందంతో పాటు ఆగస్టు నెల వచ్చిందంటే తెలుగు తమ్ముళ్లలో భయం తొణికిసలాడేది. ఏకంగా అధికారాన్ని కోల్పోవడం, పార్టీ నాయకులు ఒక్కరొక్కరే మరో పార్టీలో చేరిపోవడం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో సహా సీనియర్ నాయకులందరిని వేధిస్తోంది.

భారీ వర్షానికి ముందు కారుమబ్బుల్లాగ ఆగస్టు సంక్షోభానికి ముందు రెండు నెలలుగా తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో పడింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో ఉండడంతో పార్టీలో ఏం జరుగుతుందోనని తెలుగు తమ్ముళ్లలో ఆందోళన మరింత పెరుగుతోంది.

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీయే టార్గెట్ గా పని చేస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులను కమలం తనలో విలీనం చేసుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లక్ష్యంగా చేరికలను ఉధృతం చేసింది.

ఆగస్టు నెల శ్రావణమాసం కూడా కావడంతో పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చాలామంది కమల తీర్థం పుచ్చుకోవడం ఖాయం అని అంటున్నారు. వీరిలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, జెసీ బ్రదర్స్ వంటి సీనియర్లు ఉన్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది.

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వలేదని అలిగిన గంటా శ్రీనివాసరావు కూడా నలుగురైదుగురు ఎమ్మెల్యేలతో కలిసి బిజెపిలో చేరే అవకాశం ఉందంటున్నారు. ఈ పరిణామాలకు తోడు ఆగస్టు సంక్షోభం ఉండనే ఉందని తెలుగుదేశం సీనియర్ లతోపాటు తమ్ముళ్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

First Published:  30 July 2019 2:43 AM GMT
Next Story