Telugu Global
Cinema & Entertainment

ఆ హీరోయిన్లు వద్దన్నారు... ఈ హీరోయిన్ అయినా ఒప్పుకుంటుందా?

ఇప్పటికే మూడు సినిమాలలో హీరోగా నటించిన అక్కినేని అఖిల్…. కనీసం ఒక్క మంచి హిట్ కూడా అందుకోలేకపోయాడు. భారీ పబ్లిసిటి ఇచ్చి మరీ ‘మిస్టర్ మజ్ను’ సినిమా తో వచ్చినా డిజాస్టర్ అందుకున్న అఖిల్… ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తన నాలుగవ సినిమా చేస్తున్నాడు. ఈ మధ్యనే లాంచ్ అయిన ఈ సినిమా…. షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఇప్పటికే రష్మిక మందన్న, కీయర అద్వానీ వంటి […]

ఆ హీరోయిన్లు వద్దన్నారు... ఈ హీరోయిన్ అయినా ఒప్పుకుంటుందా?
X

ఇప్పటికే మూడు సినిమాలలో హీరోగా నటించిన అక్కినేని అఖిల్…. కనీసం ఒక్క మంచి హిట్ కూడా అందుకోలేకపోయాడు. భారీ పబ్లిసిటి ఇచ్చి మరీ ‘మిస్టర్ మజ్ను’ సినిమా తో వచ్చినా డిజాస్టర్ అందుకున్న అఖిల్… ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తన నాలుగవ సినిమా చేస్తున్నాడు.

ఈ మధ్యనే లాంచ్ అయిన ఈ సినిమా…. షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఇప్పటికే రష్మిక మందన్న, కీయర అద్వానీ వంటి హ్యాపీనింగ్ హీరోయిన్లను సంప్రదించారట. కానీ అప్పటికే పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ హీరోయిన్లు అఖిల్ తో సినిమాని ఒప్పుకోలేదని ప్రచారము చేసినా…. వరుసగా ప్లాపుల్లో ఉండడం వల్లే దూరం పెట్టారన్న మరో ప్రచారమూ సోషల్ మీడియాలో నడిచింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ప్రియాంక అరుల్ మోహన్ ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. నాని హీరోగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా లో ప్రియాంక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఆగస్ట్ లో విడుదల కాబోతుంది. అయితే వరుస ప్లాపుల్లో ఉన్న అఖిల్ సినిమాను ఈ హీరోయిన్ ఒప్పుకుంటుందా? అనేది చూడాలి. అయితే దీని గురించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.

అయితే వరుస ఫ్లాప్స్ లో ఉన్న అఖిల్ ను ఈ సినిమా అయినా కాపాడుతుందా? అనేది చూడాలి.

First Published:  30 July 2019 4:27 AM GMT
Next Story