Telugu Global
Cinema & Entertainment

కాజల్ ప్రయోగానికి దర్శకుడు రెడీ

కాజల్ నిర్మాతగా మారబోతున్న విషయం పాతదే. కేఏ వెంచర్స్ పేరిట ఆమె ఒక ప్రొడక్షన్ హౌజ్ స్థాపించబోతోందనే విషయం కూడా పాతదే. అయితే ఈ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా ఏ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వాలనే అంశంపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఎట్టకేలకు ఈ విషయంలో కాజల్ ఓ నిర్ణయం తీసుకుంది. తనకు వెరీ వెరీ స్పెషల్ మూవీని అందించిన దర్శకుడు ప్రశాంత్ వర్మకు ఛాన్స్ ఇచ్చింది కాజల్. గతంలో ప్రశాంత్ వర్మ తీసిన “అ!” అనే […]

కాజల్ ప్రయోగానికి దర్శకుడు రెడీ
X

కాజల్ నిర్మాతగా మారబోతున్న విషయం పాతదే. కేఏ వెంచర్స్ పేరిట ఆమె ఒక ప్రొడక్షన్ హౌజ్ స్థాపించబోతోందనే విషయం కూడా పాతదే. అయితే ఈ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా ఏ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వాలనే అంశంపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఎట్టకేలకు ఈ విషయంలో కాజల్ ఓ నిర్ణయం తీసుకుంది. తనకు వెరీ వెరీ స్పెషల్ మూవీని అందించిన దర్శకుడు ప్రశాంత్ వర్మకు ఛాన్స్ ఇచ్చింది కాజల్.

గతంలో ప్రశాంత్ వర్మ తీసిన “అ!” అనే సినిమాలో నటించింది కాజల్. ఇప్పటికీ తన కెరీర్ లో ఆ మూవీని వెరీ వెరీ స్పెషల్ మూవీగా చెప్పుకుంటుంది. మరోసారి అతడి దర్శకత్వంలో నటిస్తానని కూడా ప్రకటించింది. అయితే ఇలా తన సొంత బ్యానర్ పై మొదటి సినిమా అవకాశాన్నే ప్రశాంత్ కు ఇస్తుందని ఎవరూ ఊహించలేదు. ఓ అద్భుతమైన ఫిమేల్ ఓరియంటెడ్ స్టోరీలైన్ తో కాజల్ ను పడగొట్టేశాడట ప్రశాంత్. పూర్తిస్థాయిలో స్క్రీన్ ప్లే సిద్ధమైన తర్వాత సినిమాను అలా ప్రకటించి, ఇలా సెట్స్ పైకి వెళ్లిపోవాలనేది ప్లాన్.

నిజానికి తన సొంత బ్యానర్ పై సెంటిమెంట్ కొద్దీ తేజకు అవకాశం ఇవ్వాలనుకుంది కాజల్. మొన్నటివరకు తేజతోనే కథాచర్చలు కూడా సాగించింది. కానీ తేజ చెప్పిన కథ కంటే, ప్రశాంత్ వర్మ చెప్పిన స్టోరీలైన్ బ్రహ్మాండంగా ఉండడంతో.. సెంటిమెంట్ ను పక్కనపెట్టి ప్రశాంత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఈ బ్యూటీ.

ప్రస్తుతం ప్రశాంత్, కాజల్ ఎవరి ప్రాజెక్టుల్లో వారు బిజీగా ఉన్నారు. వాళ్లిద్దరూ ఫ్రీ అయిన వెంటనే కాజల్ సొంత బ్యానర్ లో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. సినిమా లాంఛింగ్ రోజున మరిన్ని వివరాలు బయటకురాబోతున్నాయి.

First Published:  30 July 2019 7:00 AM GMT
Next Story