Telugu Global
National

కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ రాజీనామా

కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో బలపరీక్షను నిర్వహించిన అనంతరం స్పీకర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్థిక బిల్లును ఆమోదించిన తర్వాత రాజీనామా చేశారు. కర్నాటక అసెంబ్లీలో ఈరోజు సీఎం యడియూరప్ప బలపరీక్షను ఎదుర్కొన్నారు. 17మంది రెబల్స్ పై వేటు వేయడంతో మేజిక్ ఫిగర్ 104 కు పడిపోయింది. మూజువాణి ఓటు ద్వారా యడియూరప్ప బలపరీక్ష నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు. ఇందులో బీజేపీకి 106మంది మద్దతు పలుకగా.. కాంగ్రెస్-జేడీఎస్ లకు […]

కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ రాజీనామా
X

కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో బలపరీక్షను నిర్వహించిన అనంతరం స్పీకర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్థిక బిల్లును ఆమోదించిన తర్వాత రాజీనామా చేశారు.

కర్నాటక అసెంబ్లీలో ఈరోజు సీఎం యడియూరప్ప బలపరీక్షను ఎదుర్కొన్నారు. 17మంది రెబల్స్ పై వేటు వేయడంతో మేజిక్ ఫిగర్ 104 కు పడిపోయింది. మూజువాణి ఓటు ద్వారా యడియూరప్ప బలపరీక్ష నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు. ఇందులో బీజేపీకి 106మంది మద్దతు పలుకగా.. కాంగ్రెస్-జేడీఎస్ లకు 99మంది సపోర్టుగా నిలిచారు. దీంతో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది.

బలపరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఓడిపోవడంతో వారి ప్రభుత్వంలో ఎన్నుకున్న స్పీకర్ రాజీనామా చేశారు. కొత్తగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన స్పీకర్ రమేష్ కుమార్ ను తొలగించడం ఖాయం. అందుకే ముందుగానే ఆయన రాజీనామా చేశారు. బిజెపిలో చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉండడంతో ఎవరిని ఈ పదవి వరిస్తుందని చర్చనీయాంశంగా మారింది.

రమేష్ కుమార్ రాజీనామా చేయడంతో ఇప్పుడు కొత్త స్పీకర్ ఎవరనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

First Published:  29 July 2019 3:09 AM GMT
Next Story