Telugu Global
NEWS

జగన్‌ గెలవడం సినిమావాళ్లకు ఇష్టం లేదు...

జగన్‌ మోహన్ రెడ్డి సీఎంగా గెలవడం సినిమా వాళ్లకు ఇష్టం లేదని ఎస్వీబీసీ చైర్మన్, నటుడు పృధ్వీ వ్యాఖ్యానించారు. అదే చంద్రబాబు తిరిగి గెలిచి ఉంటే సినిమావాళ్లంతా విమానాలు వేసుకుని వెళ్లేవారని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగా గెలిచిన జగన్‌ మోహన్‌ రెడ్డికి కనీసం శుభాకాంక్షలు చెప్పడం కూడా చిత్రపరిశ్రమ వారికి ఇష్టం లేదన్నారు. వైసీపీకి మద్దతుగా ఉన్న వారికి సినిమాల్లో అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నారన్నారు. సినిమా వాళ్లను నమ్మి ఓటు వేయవద్దని సూచించారు. సినిమా వాళ్లను చూసి ఓట్లేసే […]

జగన్‌ గెలవడం సినిమావాళ్లకు ఇష్టం లేదు...
X

జగన్‌ మోహన్ రెడ్డి సీఎంగా గెలవడం సినిమా వాళ్లకు ఇష్టం లేదని ఎస్వీబీసీ చైర్మన్, నటుడు పృధ్వీ వ్యాఖ్యానించారు. అదే చంద్రబాబు తిరిగి గెలిచి ఉంటే సినిమావాళ్లంతా విమానాలు వేసుకుని వెళ్లేవారని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగా గెలిచిన జగన్‌ మోహన్‌ రెడ్డికి కనీసం శుభాకాంక్షలు చెప్పడం కూడా చిత్రపరిశ్రమ వారికి ఇష్టం లేదన్నారు.

వైసీపీకి మద్దతుగా ఉన్న వారికి సినిమాల్లో అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నారన్నారు. సినిమా వాళ్లను నమ్మి ఓటు వేయవద్దని సూచించారు. సినిమా వాళ్లను చూసి ఓట్లేసే కాలం ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌తోనే పోయిందన్నారు. 30ఏళ్ల పాటు అమరావతి గడ్డపై వైసీపీ జెండా ఎగురుతూనే ఉంటుందన్నారు.

ఎస్వీబీసీ చైర్మన్‌గా అవకాశం రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. ఎస్వీబీసీ చానల్‌ను కోట్లాది మంది భక్తులకు మరింత చేరువ చేస్తానన్నారు. షూటింగ్‌ సమయంలో కాకుండా మిగిలిన సమయంలో ఎక్కువగా స్వామి సన్నిధిలోనే ఉంటానన్నారు.

First Published:  28 July 2019 1:20 AM GMT
Next Story