Telugu Global
National

బహుముఖ ప్రజ్ఞాశాలి...

జైపాల్‌రెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి… ఆయనకు తెలియని అంశం లేదు. దేశంలోని సమకాలీన రాజకీయ వేత్తల్లో ప్రతి అంశంపైనా పట్టు ఉండే వ్యక్తులు చాలా అరుదు. రాష్ట్ర, దేశ, విదేశ రంగాల్లో వచ్చే మార్పులపైనే కాదు, ఆర్థిక, రక్షణ, సామాజిక రంగాల్లో ఆయనకున్న పరిజ్ఞానం అపారమైనది. ఏ అంశాన్ని కదిలించినా కూలంకషంగా ఉన్నఫళంగా చెప్పగలిగిన మహానుభావుడు. రాజకీయాల్లో ఉన్నారు కనుక కుట్రలు, కుతంత్రాలు తప్పవు (వాటిని ఒక కోణంలో వ్యూహాలు అని కూడా అంటూ ఉంటారు) అందుకు జైపాల్‌రెడ్డి […]

బహుముఖ ప్రజ్ఞాశాలి...
X

జైపాల్‌రెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి… ఆయనకు తెలియని అంశం లేదు. దేశంలోని సమకాలీన రాజకీయ వేత్తల్లో ప్రతి అంశంపైనా పట్టు ఉండే వ్యక్తులు చాలా అరుదు. రాష్ట్ర, దేశ, విదేశ రంగాల్లో వచ్చే మార్పులపైనే కాదు, ఆర్థిక, రక్షణ, సామాజిక రంగాల్లో ఆయనకున్న పరిజ్ఞానం అపారమైనది. ఏ అంశాన్ని కదిలించినా కూలంకషంగా ఉన్నఫళంగా చెప్పగలిగిన మహానుభావుడు.

రాజకీయాల్లో ఉన్నారు కనుక కుట్రలు, కుతంత్రాలు తప్పవు (వాటిని ఒక కోణంలో వ్యూహాలు అని కూడా అంటూ ఉంటారు) అందుకు జైపాల్‌రెడ్డి కూడా అతీతులేమీ కాదు. అయితే ఆయన సుదీర్ఘకాలం పాటు రాజకీయం నెరపడం అనేది ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది.

ఆంగ్లంలో ఆయన పరిజ్ఞానం తిరుగులేనిది. ఆయన పార్లమెంటులో చేసిన ప్రసంగాల్లో వాడిన పదజాలం కొమ్ములు తిరిగిన జర్నలిస్టులకే అర్థం అయ్యేది కాదు. విదేశీ జర్నలిస్టులు సైతం ఆయన వాడిన పదాలకు అర్థాలకు డిక్షనరీలు వెతుక్కోవాల్సి వచ్చేది.

అంగ వైకల్యాన్ని జైపాల్‌రెడ్డి అధిగమించి మొక్కవోని ఆత్మవిశ్వాసంతో సుమారు 60 ఏళ్లపాటు రాజ కీయాలు చేయడం అనన్య సామాన్యం. బోఫోర్స్‌ కుంభకోణం ఛాంపియన్‌ అయిన జైపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం కూడా ఓ విడ్డూరమే… గొప్ప మేధావి అయిన జైపాల్‌ రెడ్డి స్వభావరీత్యా బీజేపీలోకి వెళ్లేందుకు సాధ్యం కాదు. అందుకే కాంగ్రెస్‌లో మిగిలారు.
భారతీయ రాజకీయాలు ఉన్నంత కాలం ఆయన జ్ఞాపకాలు ఉంటాయి. జైపాల్‌రెడ్డి నేటి వరకూ వర్తమానం. ఇకపై చరిత్రలో ఉంటారు.

First Published:  28 July 2019 12:12 AM GMT
Next Story