Telugu Global
Cinema & Entertainment

బిగ్ బాస్ 3.... హేమ అవుట్.... తమన్నా ఇన్

బిగ్ బాస్ 3 ఈ మధ్యనే మొదలైన సంగతి తెలిసిందే. వారాంతం వచ్చేసింది కాబట్టి మొదటి వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అని ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వారం హిమజా, రాహుల్, హేమ, పునర్నవి, వితిక మరియు జాఫర్ నామినేషన్స్ కి వెళ్లారు. అయితే శనివారం నాడు జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున, హిమజ మరియు పునర్నవి సేఫ్ జోన్ లో ఉన్నట్లు ప్రకటించారు. ఇక మిగిలిన […]

బిగ్ బాస్ 3.... హేమ అవుట్.... తమన్నా ఇన్
X

బిగ్ బాస్ 3 ఈ మధ్యనే మొదలైన సంగతి తెలిసిందే. వారాంతం వచ్చేసింది కాబట్టి మొదటి వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అని ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ వారం హిమజా, రాహుల్, హేమ, పునర్నవి, వితిక మరియు జాఫర్ నామినేషన్స్ కి వెళ్లారు. అయితే శనివారం నాడు జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున, హిమజ మరియు పునర్నవి సేఫ్ జోన్ లో ఉన్నట్లు ప్రకటించారు. ఇక మిగిలిన నలుగురిలో ఎవరో ఒకళ్ళు ఇవాళ ఎలిమినేట్ అవ్వబోతున్నారు.

తాజా సమాచారం ప్రకారం హేమ మొదటి వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లోకి రెండవ వారం ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వనుంది. గత కొన్ని రోజులుగా ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా రానున్నారని వార్తలు వినిపించాయి.

ఇప్పుడు అవే నిజం కానున్నాయి. వచ్చేవారం తమన్నా సింహాద్రి బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా ఎంటర్ అవ్వబోతున్నారు. అది ఎప్పుడు అనే విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

మరోవైపు సీజన్ 3 మొదలైన రెండు మూడు రోజులకే హౌస్ మేట్స్ మధ్య గొడవలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

First Published:  28 July 2019 7:22 AM GMT
Next Story