Telugu Global
NEWS

రాజధానిలో బాలకృష్ణకు 500 ఎకరాలు

రాజధాని నూజివీడు సమీపంలో వస్తుందని తొలుత ప్రజలను తవ్వుదోవ పట్టించిన టీడీపీ పెద్దలు… ఆ తర్వాత రాజధానిని తుళ్లూరు ప్రాంతంలో అని ప్రకటించారు. రాజధాని నూజీవీడు వైపు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించిన చంద్రబాబు, కీలక టీడీపీ నేతలు… ఆ సమయంలోనే తుళ్లూరు ప్రాంతంలో భారీగా భూములు కొనుగోలు చేశారన్నది వైసీపీ చేసిన ఆరోపణ. రాజధాని ప్రాంతాన్ని అధికారికంగా ప్రకటించడాని కంటే ముందే చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, కీలక నేతలు రాజధాని ఎక్కడ వస్తుందో ముందే […]

రాజధానిలో బాలకృష్ణకు 500 ఎకరాలు
X

రాజధాని నూజివీడు సమీపంలో వస్తుందని తొలుత ప్రజలను తవ్వుదోవ పట్టించిన టీడీపీ పెద్దలు… ఆ తర్వాత రాజధానిని తుళ్లూరు ప్రాంతంలో అని ప్రకటించారు.

రాజధాని నూజీవీడు వైపు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించిన చంద్రబాబు, కీలక టీడీపీ నేతలు… ఆ సమయంలోనే తుళ్లూరు ప్రాంతంలో భారీగా భూములు కొనుగోలు చేశారన్నది వైసీపీ చేసిన ఆరోపణ.

రాజధాని ప్రాంతాన్ని అధికారికంగా ప్రకటించడాని కంటే ముందే చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, కీలక నేతలు రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసుకుని తక్కువ ధరకే భూములు కొనుగోలు చేశారన్నది పెద్దెత్తున వచ్చిన విమర్శ.

ఇందుకు బలాన్ని ఇచ్చేలా రాజధాని ప్రకటనకు కొద్దిరోజుల ముందే తుళ్లూరు ప్రాంతంలో టీడీపీ కీలక పెద్దలు భారీగా భూములు కొనుగోలు చేసిన వివరాలు బయటకు వచ్చాయి.

ఇలా చంద్రబాబు వద్ద నుంచి రాజధానికి సంబంధించిన సమాచారం ముందే తెలుసుకుని భూములు కొన్న వారి జాబితాలో నటుడు బాలకృష్ణ పేరు కూడా తెరపైకి వచ్చింది.

ఒక ఆంగ్ల దినపత్రిక ఆదివారం ఇందుకు సంబంధించి ఒక కథనాన్ని ప్రచురించింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా బాలకృష్ణ రాజధాని ప్రాంతంలో 500 ఎకరాల భూమిని రాజధాని ప్రకటనకు ముందు కొనుగోలు చేసినట్టు గుర్తించామని…. ప్రభుత్వ వర్గాలు కూడా చెప్పినట్టు కథనాన్ని ప్రచురించింది.

నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బాలకృష్ణ బావమరిది కావడం వల్లే రాజధాని సమాచారం ముందే లీక్ అయిందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

First Published:  28 July 2019 5:09 AM GMT
Next Story