Telugu Global
International

మళ్లీ క్షిపణులతో కిమ్ కవ్వింపు

ఉత్తర కొరియా నియంత కిమ్ జంగ్ ఉన్ మరోసారి క్షిపణులతో గర్జించాడు. ఒకవైపు శాంతి చర్చలకు సిద్ధం అంటూనే రెండు కొత్త తరహా క్షిపణులను ఉత్తరకొరియా పరీక్షించింది. గురువారం సముద్రం మీదుగా వీటిని కిమ్ ప్రయోగించాడు. ఈ ప్రయోగాలను స్వయంగా కిమ్ దగ్గరుండి పర్యవేక్షించాడు. న్యూక్లియర్‌ పరీక్షల నిలుపుదలపై కిమ్‌తో అమెరికా చర్చలు జరుగుతున్న సమయంలో ఉత్తరకొరియా ఈ క్షిపణులను ప్రయోగించడం చర్చనీయాంశమైంది. శాంతి చర్చలు జరుగుతున్నంత మాత్రాన తాను మౌనంగా ఉండబోనని… తన రక్షణ ఏర్పాట్లు […]

మళ్లీ క్షిపణులతో కిమ్ కవ్వింపు
X

ఉత్తర కొరియా నియంత కిమ్ జంగ్ ఉన్ మరోసారి క్షిపణులతో గర్జించాడు. ఒకవైపు శాంతి చర్చలకు సిద్ధం అంటూనే రెండు కొత్త తరహా క్షిపణులను ఉత్తరకొరియా పరీక్షించింది.

గురువారం సముద్రం మీదుగా వీటిని కిమ్ ప్రయోగించాడు. ఈ ప్రయోగాలను స్వయంగా కిమ్ దగ్గరుండి పర్యవేక్షించాడు. న్యూక్లియర్‌ పరీక్షల నిలుపుదలపై కిమ్‌తో అమెరికా చర్చలు జరుగుతున్న సమయంలో ఉత్తరకొరియా ఈ క్షిపణులను ప్రయోగించడం చర్చనీయాంశమైంది.

శాంతి చర్చలు జరుగుతున్నంత మాత్రాన తాను మౌనంగా ఉండబోనని… తన రక్షణ ఏర్పాట్లు తాను చేసుకుంటూనే ఉంటానన్న సంకేతాలు పంపేందుకే కిమ్ ఈ పనిచేసినట్టు భావిస్తున్నారు.

ఉత్తరకొరియా తాజా ప్రయోగాలను దక్షిణ కొరియా కూడా ధృవీకరించింది. రెండు క్షిపణుల్లో ఒకటి 430 కి.మీ, మరొకటి 690 కి.మీ ప్రయాణించినట్టు అధికారులు చెబుతున్నారు.

దక్షిణ కొరియాకు హెచ్చరికగా తాజా క్షిపణి ప్రయోగం చేపట్టినట్టు కిమ్‌ ప్రకటించాడు. శాంతి మంత్రం పేరుతో దక్షిణ కొరియా తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఉత్తరకొరియా ఆరోపిస్తోంది. అమెరికాతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలను దక్షిణ కొరియా చేయడాన్ని కిమ్ తప్పుపడుతున్నాడు. దక్షిణ కొరియా నాయకుల తీరు మారకపోతే అందుకు మూల్యం చెల్లించుకుని తీరుతారని కిమ్ హెచ్చరించాడు.

First Published:  26 July 2019 12:20 AM GMT
Next Story