Telugu Global
Cinema & Entertainment

సింగిల్ షాట్ లో తీసి... పక్కనపెట్టారు

సినిమాకు ప్రచారం కల్పించాలని నిర్ణయించినప్పుడు మూవీలో ఉన్న బెస్ట్ సీన్స్ వాడతారు. ప్రమోషన్ లో వాటినే హైలెట్ చేస్తారు. డియర్ కామ్రేడ్ విషయంలో కూడా అలానే చేశారు. సింగిల్ షాట్ లో తీసిన ఓ సాంగ్ ను బాగా వైరల్ చేశారు. ఆ పాట వెనక జరిగిన కథను, మేకింగ్ వీడియోను, పాట లిరిక్స్ ను పాపులర్ చేశారు. ఇంత హంగామా చేసి, రిలీజ్ టైమ్ కు సినిమాలో ఆ పాట లేకుండా చేశారు. అవును.. డియర్ […]

సింగిల్ షాట్ లో తీసి... పక్కనపెట్టారు
X

సినిమాకు ప్రచారం కల్పించాలని నిర్ణయించినప్పుడు మూవీలో ఉన్న బెస్ట్ సీన్స్ వాడతారు. ప్రమోషన్ లో వాటినే హైలెట్ చేస్తారు. డియర్ కామ్రేడ్ విషయంలో కూడా అలానే చేశారు. సింగిల్ షాట్ లో తీసిన ఓ సాంగ్ ను బాగా వైరల్ చేశారు. ఆ పాట వెనక జరిగిన కథను, మేకింగ్ వీడియోను, పాట లిరిక్స్ ను పాపులర్ చేశారు. ఇంత హంగామా చేసి, రిలీజ్ టైమ్ కు సినిమాలో ఆ పాట లేకుండా చేశారు.

అవును.. డియర్ కామ్రేడ్ సినిమాలో క్యాంటీన్ సాంగ్ లేదు. సింగిల్ షాట్ లో, ఎంతో కష్టపడి తీసిన ఈ పాటను సినిమా నుంచి లేపేశారు. డియర్ కామ్రేడ్ రన్ టైమ్ అప్పటికే పెరిగిపోయింది. 3 గంటలకు ఓ 10 నిమిషాలు తక్కువుంది. ఈ పాట, దాని వెంట వచ్చే సన్నివేశం కూడా కలిపితే సినిమా సరిగ్గా 3 గంటలవుతుంది. ఇంత రన్ టైమ్ రిస్క్ అని భావించి ఎంతో ఆలోచించి ఈ పాట లేపేశారు మేకర్స్.

నిజానికి సినిమా సెకెండాఫ్ కొంచెం బోర్ కొట్టించేసింది. ఈ పాట కూడా పెట్టినట్టయితే రన్ టైమ్ పెరిగిపోయి మరింత విసుగొచ్చేది. కానీ ఈ పాటను ఫస్టాఫ్ లో అలానే ఉంచి, సెకండాఫ్ లో బోర్ కొట్టించే సీన్స్ కొన్ని లేపేస్తే బాగుండేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి ఇప్పటికే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మేకర్స్ ఏమైనా రిపేర్లు చేస్తారేమో చూడాలి.

First Published:  26 July 2019 5:49 AM GMT
Next Story