Telugu Global
National

కర్ణాటక సీఎంగా ఇతడే.... బీజేపీ గ్రీన్ సిగ్నల్

కన్నడ నాట ప్రభుత్వాన్ని కూల్చిన బీజేపీ…. అంతే ఉత్సాహంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాను ఆమోదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? లేక తిరస్కరించి వారిని కలిపేసుకొని ఇలా చేస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పుడు అధికార బీజేపీకి మెజార్టీ ఉండడంతో సహజంగానే బీజేపీ నామినేట్ చేసిన గవర్నర్…. ప్రభుత్వ ఏర్పాటుకు ఆపార్టీనే కోరడం సహజం.. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలను చర్చించేందుకు కర్ణాటక బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప గురువారం […]

కర్ణాటక సీఎంగా ఇతడే.... బీజేపీ గ్రీన్ సిగ్నల్
X

కన్నడ నాట ప్రభుత్వాన్ని కూల్చిన బీజేపీ…. అంతే ఉత్సాహంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాను ఆమోదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? లేక తిరస్కరించి వారిని కలిపేసుకొని ఇలా చేస్తారా? అన్నది ఆసక్తిగా మారింది.

ఇప్పుడు అధికార బీజేపీకి మెజార్టీ ఉండడంతో సహజంగానే బీజేపీ నామినేట్ చేసిన గవర్నర్…. ప్రభుత్వ ఏర్పాటుకు ఆపార్టీనే కోరడం సహజం.. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలను చర్చించేందుకు కర్ణాటక బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప గురువారం ఉదయం హోంశాఖ మంత్రి , బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. చర్చలు జరిపారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని అమిత్ షాను కోరినట్టు తెలిసింది. దీనికి షా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఆహ్వానించగానే యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇప్పటికే ఈ మేరకు యడ్యూరప్ప తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఐదుగురు ఎమ్మెల్యేలను మంత్రులుగా చేసి మంత్రివర్గంలోకి తీసుకోవడానికి రెడీ అయ్యారని తెలిసింది.

కాగా శుక్రవారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు యడ్యూరప్ప నిర్ణయించి… అదే రోజు ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీ అయినట్టు సమాచారం.

First Published:  25 July 2019 12:10 AM GMT
Next Story