Telugu Global
NEWS

టెస్ట్ క్రికెట్లోనూ ఇక జెర్సీలకు నంబర్లు

విండీస్ తో టెస్ట్ సిరీస్ లో భారతజట్టు జెర్సీలకూ నంబర్లు యాషెస్ సిరీస్ నుంచే టెస్ట్ క్రికెట్లో సరికొత్త ప్రయోగం సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో సరికొత్త ప్రయోగానికి..త్వరలో ప్రారంభమయ్యే ఇంగ్లండ్-ఆస్ట్ర్రేలియా జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్ ద్వారా తెరలేవనుంది. ఇప్పటి వరకూ వన్డే, టీ-20 ఫార్మాట్లలో మాత్రమే..ఆటగాళ్లు ధరించే జెర్సీలకు నంబర్లు, పేర్లు ఇచ్చే సాంప్రదాయం ఉంది. అయితే…టెస్ట్ క్రికెట్ ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దటానికి వీలుగా అంతర్జాతీయ క్రికెట్ మండలి ..శతాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయానికి తెరదించి… […]

టెస్ట్ క్రికెట్లోనూ ఇక జెర్సీలకు నంబర్లు
X
  • విండీస్ తో టెస్ట్ సిరీస్ లో భారతజట్టు జెర్సీలకూ నంబర్లు
  • యాషెస్ సిరీస్ నుంచే టెస్ట్ క్రికెట్లో సరికొత్త ప్రయోగం

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో సరికొత్త ప్రయోగానికి..త్వరలో ప్రారంభమయ్యే ఇంగ్లండ్-ఆస్ట్ర్రేలియా జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్ ద్వారా తెరలేవనుంది.

ఇప్పటి వరకూ వన్డే, టీ-20 ఫార్మాట్లలో మాత్రమే..ఆటగాళ్లు ధరించే జెర్సీలకు నంబర్లు, పేర్లు ఇచ్చే సాంప్రదాయం ఉంది.

అయితే…టెస్ట్ క్రికెట్ ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దటానికి వీలుగా అంతర్జాతీయ క్రికెట్ మండలి ..శతాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయానికి తెరదించి… విఫ్లవాత్మకంగా టెస్ట్ క్రికెట్ జెర్సీలకు నంబర్లు ఇవ్వాలని నిర్ణయించింది.

ఆగస్టులో ప్రారంభమయ్యే ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ ద్వారా జెర్సీ నంబర్లు ఇవ్వాలని నిర్ణయించింది. యాషెస్ సిరీస్ లో పాల్గొనే ఇంగ్లండ్, ఆస్ట్ర్రేలియా జట్ల ఆటగాళ్లు జెర్సీలపై తమ పేర్లతో పాటు నంబర్లను ధరించి మరీ పోటీకి దిగనున్నారు.

ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ తన పేరుతో పాటు 66వ నంబర్ ఉన్న జెర్సీని ధరించనున్నాడు.

భారత టెస్ట్ జట్టుకూ జెర్సీ నంబర్లు…

ఆగస్టు 22 నుంచి వెస్టిండీస్ తో జరిగే రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భారతజట్టు తొలిసారిగా ఆటగాళ్ల పేర్లతో పాటు..నంబర్లున్న జెర్సీలు ధరించనున్నారు.

విరాట్ జెర్సీ నంబర్ 18

భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ తన టెస్ట్ జెర్సీపైన పేరుతో పాటు…18వ నంబర్ తో బరిలోకి దిగనున్నాడు. రోహిత్ శర్మ కు 45వ నంబర్ జెర్సీని కేటాయించారు.

అయితే…గతంలో మాస్టర్ సచిన్ టెండుల్కర్ ధరించిన నంబర్ 10 జెర్సీని ఎవ్వరూ ధరించకుండా రిటైర్ చేసిన సంగతి తెలిసిందే.

మహేంద్ర సింగ్ ధోనీ ధరించే నంబర్ 7 ను సైతం మరే ఆటగాడికీ కేటాయించకుండా రిటైర్ చేయాలన్న ఆలోచనలో బీసీసీఐ ఉంది.

సాంప్రదాయవాదుల గరంగరం…

శతాబ్దాలుగా వస్తున్న టెస్ట్ క్రికెట్ సాంప్రదాయాలను ఐసీసీ భ్రష్టు పట్టించడానికి ప్రయోగాలు చేస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టెస్ట్ క్రికెట్ పవిత్రతను కాపాడాలంటూ సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

టెస్ట్ మ్యాచ్ లు ఆడే సమయంలో జెర్సీలకు పేర్లు, నంబర్లు తగిలించడాన్ని తప్పుపడుతున్నారు.

First Published:  24 July 2019 8:18 PM GMT
Next Story