Telugu Global
Cinema & Entertainment

నాగార్జునకు అదే బలం.... వర్కవుట్ అవుతుందా?

సినిమాలు హిట్టా ఫ్లాపా అని తేల్చడానికి దాని కలెక్షన్లు చూస్తాం. మరి బుల్లితెర అయిన టీవీ షోలు, సీరియళ్లు, అందులో ప్రసారమయ్యే సినిమాలు ప్రేక్షక ఆదరణ పొందాయా అంటే ఏం చూస్తాం. టీఆర్పీ రేటింగ్ లు. అవును.. ఇప్పుడు దీన్ని బట్టే ఆ షో హిట్టా లేదా ఫ్లాపా అని తేలుస్తారు. అసలు హిట్ అవుతుందో లేదోనని భయం భయంగానే మొదలు పెట్టిన తెలుగు బిగ్ బాస్ మొదటి షో 16కు పైగా రేటింగ్ తో మొదటి […]

నాగార్జునకు అదే బలం.... వర్కవుట్ అవుతుందా?
X

సినిమాలు హిట్టా ఫ్లాపా అని తేల్చడానికి దాని కలెక్షన్లు చూస్తాం. మరి బుల్లితెర అయిన టీవీ షోలు, సీరియళ్లు, అందులో ప్రసారమయ్యే సినిమాలు ప్రేక్షక ఆదరణ పొందాయా అంటే ఏం చూస్తాం. టీఆర్పీ రేటింగ్ లు. అవును.. ఇప్పుడు దీన్ని బట్టే ఆ షో హిట్టా లేదా ఫ్లాపా అని తేలుస్తారు.

అసలు హిట్ అవుతుందో లేదోనని భయం భయంగానే మొదలు పెట్టిన తెలుగు బిగ్ బాస్ మొదటి షో 16కు పైగా రేటింగ్ తో మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన ఈ షో లో శివబాలాజీ విజేతగా నిలిచాడు.

రెండో సీజన్ ఫర్వాలేదనిపించగా.. ఇప్పుడు బిగ్ బాస్ 3వ సీజన్ ను సీనియర్ హీరో నాగార్జున హోస్ట్ చేస్తున్నాడు. మరి ఇది ఎంత రేటింగ్ వస్తుందనేది ఆసక్తిగా మారింది.

అయితే నాగార్జున ఇది వరకు చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గ్రాండ్ హిట్ అవ్వడం బిగ్ బాస్ టీం భరోసా ఉండడానికి కారణమైంది. నాగార్జున తన అభినయంతో ఈ షోను పీక్ స్టేజ్ కు తీసుకెళ్లాడు.

2014లో నాగార్జున చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో ప్రేక్షకాదరణ పొందింది. దీన్ని బట్టి నాగార్జున పాత షోతో ఇప్పుడు చేపట్టిన కొత్త బిగ్ బాస్ షోపై నిర్వాహకులకు అంచనాలు పెరిగాయి.

బిగ్ బాస్ 3వ సీజన్ ను ఘనంగా ప్రారంభించి మొదలు పెట్టిన నాగార్జునకు పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. మొదటి షోను ఎన్టీఆర్ పీక్ స్టేజ్ కు తీసుకెళ్లగా.. రెండోసీజన్ లో నాని ఫర్వాలేదనిపించాడు.

తాజాగా మూడో సీజన్ ను మాత్రం నాగార్జున బాగానే డీల్ చేశాడని అర్థమవుతోంది. మరి కొద్దిరోజులు ఆగితే కానీ పూర్తి విషయం తేలుతుంది. మరి మున్ముందు బిగ్ బాస్ షోను నాగార్జున ఎలా ముందుకు తీసుకెళుతాడన్నది వేచిచూడాలి.

First Published:  25 July 2019 2:26 AM GMT
Next Story