Telugu Global
NEWS

భూమా ఫ్యామిలీలో భారీ ప్ర‌కంప‌న !

ఆళ్లగడ్డ టిడిపి రాజకీయంలో భారీ ప్రకంపనలు మొద‌ల‌య్యాయి. ఆళ్ల‌గ‌డ్డ అంటే భూమా…భూమా అంటే ఆళ్ల‌గ‌డ్డ అని ఇన్నాళ్లు న‌డిచిన రాజ‌కీయంలో ఇప్పుడు కొత్త కొత్త మార్పులు క‌నిపిస్తున్నాయి. భూమా వ‌ర్గం నిట్ట‌నిలువునా చీలింది. భూమా ఫ్యామిలీ నుంచి మ‌రో నేత ప్ర‌త్య‌క్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. భూమా కిషోర్ రెడ్డి రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారు. ఆయ‌న వెంట ర‌క్త‌సంబంధీకులు, ఇత‌ర అనుచ‌రులు ఉన్నారు. ఇప్ప‌టికే ఢిల్లీకి చేరుకున్న ఆయ‌న బీజేపీలో చేర‌డం ఖాయమైంది. ఆయన వెంట భూమా కుటుంబ […]

భూమా ఫ్యామిలీలో భారీ ప్ర‌కంప‌న !
X

ఆళ్లగడ్డ టిడిపి రాజకీయంలో భారీ ప్రకంపనలు మొద‌ల‌య్యాయి. ఆళ్ల‌గ‌డ్డ అంటే భూమా…భూమా అంటే ఆళ్ల‌గ‌డ్డ అని ఇన్నాళ్లు న‌డిచిన రాజ‌కీయంలో ఇప్పుడు కొత్త కొత్త మార్పులు క‌నిపిస్తున్నాయి. భూమా వ‌ర్గం నిట్ట‌నిలువునా చీలింది. భూమా ఫ్యామిలీ నుంచి మ‌రో నేత ప్ర‌త్య‌క్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

భూమా కిషోర్ రెడ్డి రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారు. ఆయ‌న వెంట ర‌క్త‌సంబంధీకులు, ఇత‌ర అనుచ‌రులు ఉన్నారు. ఇప్ప‌టికే ఢిల్లీకి చేరుకున్న ఆయ‌న బీజేపీలో చేర‌డం ఖాయమైంది. ఆయన వెంట భూమా కుటుంబ సభ్యుల్లోని ప్రముఖులు కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

భూమా కిషోర్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీతో ఆళ్లగడ్డ రాజకీయం మ‌లుపులు తిర‌గ‌డం ఖాయం. రాబోయే ఎన్నికల నాటికి అసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఆళ్ల‌గ‌డ్డ‌లో ఇప్ప‌టికే భూమా అఖిల‌ప్రియ ఉన్నారు. ఆ కుటుంబం నుంచి మ‌రోనేత రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఆయ‌న బీజేపీ కండువా కప్పుకుంటున్నారు. ఇప్ప‌టికే గంగుల వ‌ర్గం వైసీపీలో ఉంది. దీంతో ఆళ్ల‌గ‌డ్డ‌లో త్రిముఖ పోరు న‌డిచే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

త్వరలోనే ఆళ్లగడ్డ వేదికగా రాజకీయ శంఖారావం స‌భ నిర్వ‌హించే ఆలోచ‌నలో కిషోర్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నారు.ఆ సమావేశానికి తెలుగు రాష్ట్రాలల్లో ని బిజెపి కీలక నేతలు హాజరు అయ్యే అవకాశం ఉంది. కిషోర్ ఎంట్రీతో ఆళ్లగడ్డ రాజకీయం ఎటు వైపు వెళ్తుందో అని అధికార, ప్రతిపక్ష నేతలు నిశీతంగా ప‌రిశీలిస్తున్నారు.

First Published:  25 July 2019 12:20 AM GMT
Next Story