Telugu Global
Cinema & Entertainment

మరోసారి బాలకృష్ణ సరసన

టాలీవుడ్ ప్రేక్షకులకు సోనాల్ చౌహాన్ పేరుచెప్పగానే వెంటనే బాలయ్య సినిమాలు టకటకా గుర్తొస్తాయి. ఇతర హీరోలతో కూడా ఆమె నటించినప్పటికీ బాలయ్య సినిమాలతోనే ఆమె తెలుగులో బాగా పాపులర్ అయింది. అందుకే బాలయ్య ఎప్పుడు అడిగినా కాల్షీట్లు ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. ఈ క్రమంలో మరోసారి బాలయ్య ఈమెను పిలిపించాడు. కొత్త సినిమా ఛాన్స్ ఇచ్చాడు. త్వరలోనే కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు బాలయ్య. ఈ సినిమాకు ‘క్రాంతి’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ […]

మరోసారి బాలకృష్ణ సరసన
X

టాలీవుడ్ ప్రేక్షకులకు సోనాల్ చౌహాన్ పేరుచెప్పగానే వెంటనే బాలయ్య సినిమాలు టకటకా గుర్తొస్తాయి. ఇతర హీరోలతో కూడా ఆమె నటించినప్పటికీ బాలయ్య సినిమాలతోనే ఆమె తెలుగులో బాగా పాపులర్ అయింది. అందుకే బాలయ్య ఎప్పుడు అడిగినా కాల్షీట్లు ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. ఈ క్రమంలో మరోసారి బాలయ్య ఈమెను పిలిపించాడు. కొత్త సినిమా ఛాన్స్ ఇచ్చాడు.

త్వరలోనే కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు బాలయ్య. ఈ సినిమాకు ‘క్రాంతి’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ ను ఫిక్స్ చేశారు. బాలయ్యతో ఈమెకిది వరుసగా మూడో చిత్రం. ఇంతకుముందు లెజెండ్, డిక్టేటర్ సినిమాలు చేసింది.

తెలుగులో ఈమె పండగ చేస్కో, రెయిన్ బో, సైజ్ జీరో లాంటి సినిమాలు కూడా చేసింది. కానీ బాలయ్య సినిమాలతోనే ఆమె ఎక్కువగా పాపులర్ అయింది. త్వరలోనే క్రాంతి సినిమా సెట్స్ లో ప్రత్యక్షంకానుంది ఈ హాట్ లేడీ. అన్నట్టు ఈ సినిమాను సంక్రాంతి బరి నుంచి తప్పించారు. ఇప్పటికే సంక్రాంతి బెర్తులన్నీ నిండిపోవడంతో.. ఈసారి పొంగల్ కు బాలయ్య హంగామా లేనట్టే.

First Published:  24 July 2019 11:50 AM GMT
Next Story