Telugu Global
NEWS

మోడీ-షా ల ఆపరేషన్ దక్షిణాది.... పరిణామాలివే....

ఉత్తర భారతమంతా గెలిచిన బీజేపీకి దక్షిణాది మాత్రం కొరకరాని కొయ్యగానే మిగిలింది. తమిళనాట ప్రాంతీయ పార్టీలకు చోటు లేదు. ఇక ఏపీలో బీజేపీ సున్నా.. కేరళలోనూ చోటు లేదు. కర్ణాటకలో ఇన్నాళ్లు కాంగ్రెస్-జేడీఎస్ ఉండేది.. దాన్ని కూల్చేశారు. ఇప్పుడు కర్ణాటకలో పగ్గాలు చేపట్టిన బీజేపీ ఫుల్ ఫోకస్ ఇక దక్షిణాదిపై పెట్టినట్టు కనిపిస్తోంది. దీంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కర్ణాటకలో అధికారం కొల్గగొట్లాలని గవర్నర్ ను పావుగా వాడి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముంబై తరలించి… బీజేపీ […]

మోడీ-షా ల ఆపరేషన్ దక్షిణాది.... పరిణామాలివే....
X

ఉత్తర భారతమంతా గెలిచిన బీజేపీకి దక్షిణాది మాత్రం కొరకరాని కొయ్యగానే మిగిలింది. తమిళనాట ప్రాంతీయ పార్టీలకు చోటు లేదు. ఇక ఏపీలో బీజేపీ సున్నా.. కేరళలోనూ చోటు లేదు. కర్ణాటకలో ఇన్నాళ్లు కాంగ్రెస్-జేడీఎస్ ఉండేది.. దాన్ని కూల్చేశారు.

ఇప్పుడు కర్ణాటకలో పగ్గాలు చేపట్టిన బీజేపీ ఫుల్ ఫోకస్ ఇక దక్షిణాదిపై పెట్టినట్టు కనిపిస్తోంది. దీంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కర్ణాటకలో అధికారం కొల్గగొట్లాలని గవర్నర్ ను పావుగా వాడి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముంబై తరలించి… బీజేపీ చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు.

ఎట్టకేలకు బలపరీక్షలో కుమారస్వామి సర్కారు కూలిపోవడం.. బీజేపీ గద్దెనెక్కడం జరిగిపోయింది. దీంతో ఇప్పుడు బీజేపీ ఫుల్ ఫోకస్ దక్షిణాది మిగతా రాష్ట్రాలపై పడింది.

ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో ఇప్పటికే కార్యాచరణ మొదలు పెట్టినట్టు కనిపిస్తోంది. తాజాగా ఆర్ఎస్ఎస్-బీజేపీ వాది అయిన విశ్వభూషన్ ను ఏపీకి గవర్నర్ గా కేంద్రం నియమించింది. ఈయన కరుడుగట్టిన బీజేపీ వాది కావడంతో ఏపీలో చంద్రబాబును బలహీనంచేసి అధికారపక్షమైన వైసీపీ టార్గెట్ గా రాజకీయాలు చేయడానికి బీజేపీ రెడీ అయినట్లు అర్థమవుతోంది.

ఇక తెలంగాణలోనూ కేసీఆర్ కు తాజాగా షాక్ ఇచ్చింది. గవర్నర్ నరసింహన్ ద్వారా మున్సిపల్ చట్టానికి బ్రేకులు వేయించింది. ఇక అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాలకు మోకాలడ్డుతోంది.

ఇలా బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బలపడడానికి అనువుగా అందుబాటులో ఉన్న వ్యవస్థలను మేనేజ్ చేసే స్థాయికి చేరింది. రేపో మాపో ఇక ఏపీ, తెలంగాణల్లో ఇతర అంశాల్లో కూడా వరుసగా షాకులు ఇవ్వడమే తరువాయి అన్న అంచనాలు నెలకొంటున్నాయి.

First Published:  24 July 2019 3:53 AM GMT
Next Story