Telugu Global
Cinema & Entertainment

కాజల్ మనసు అటువైపు మళ్ళింది...?

ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రానా దగ్గుబాటి, నవదీప్, జగపతిబాబు వంటి సినీ నటులు కూడా వెబ్ సిరీస్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజా సమాచారం ప్రకారం కాజల్ అగర్వాల్ కూడా ఈ జాబితాలో చేరనుంది. కాజల్ మనసు కూడా వెబ్ సిరీస్ వైపు మళ్ళింది. కాజల్ ఒక తమిళ వెబ్ సిరీస్ లో నటించబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న […]

కాజల్ మనసు అటువైపు మళ్ళింది...?
X

ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రానా దగ్గుబాటి, నవదీప్, జగపతిబాబు వంటి సినీ నటులు కూడా వెబ్ సిరీస్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

తాజా సమాచారం ప్రకారం కాజల్ అగర్వాల్ కూడా ఈ జాబితాలో చేరనుంది. కాజల్ మనసు కూడా వెబ్ సిరీస్ వైపు మళ్ళింది. కాజల్ ఒక తమిళ వెబ్ సిరీస్ లో నటించబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో కాజల్ ఒక కీలక పాత్ర పోషించబోతోందట.

నటించటం మాత్రమే కాకుండా కాజల్ అగర్వాల్ ఒక వెబ్ సిరీస్ ని నిర్మించేందుకు కూడా ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

ఇక సినిమాల పరంగా చూస్తే ఈ మధ్యనే ‘సీత’ సినిమాలో కనిపించిన కాజల్ అగర్వాల్ త్వరలో శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘రణరంగం’ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కాబోతోంది. ఈ సినిమా కాకుండా ‘క్వీన్’ తమిళ్ రీమేక్ అయిన ‘ప్యారిస్ ప్యారిస్’ సినిమాలో కూడా కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది.

First Published:  24 July 2019 3:57 AM GMT
Next Story