Telugu Global
International

టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత్ టాప్

నంబర్ వన్ స్థానం నిలుపుకొన్న విరాట్ కొహ్లీ సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో భారత్ తన నంబర్ వన్ ర్యాంక్ ను నిలుపుకొంది. ఐసీసీ ప్రకటించిన టెస్ట్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా మొదటి మూడుస్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇంగ్లండ్ నాలుగు, ఆస్ట్ర్రేలియా ఐదు ర్యాంకుల్లో నిలిచాయి. తిరుగులేని విరాట్ కొహ్లీ… భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ…టెస్ట్ క్రికెట్లో సైతం ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను నిలబెట్టుకొన్నాడు. ఆస్ట్ర్రేలియాతో ముగిసిన మూడుమ్యాచ్ ల సిరీస్ లో 2-1తో భారత్ విజేతగా […]

టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత్ టాప్
X
  • నంబర్ వన్ స్థానం నిలుపుకొన్న విరాట్ కొహ్లీ

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో భారత్ తన నంబర్ వన్ ర్యాంక్ ను నిలుపుకొంది. ఐసీసీ ప్రకటించిన టెస్ట్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా మొదటి మూడుస్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇంగ్లండ్ నాలుగు, ఆస్ట్ర్రేలియా ఐదు ర్యాంకుల్లో నిలిచాయి.

తిరుగులేని విరాట్ కొహ్లీ…

భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ…టెస్ట్ క్రికెట్లో సైతం ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను నిలబెట్టుకొన్నాడు. ఆస్ట్ర్రేలియాతో ముగిసిన మూడుమ్యాచ్ ల సిరీస్ లో 2-1తో భారత్ విజేతగా నిలిచిన సమయంలో కొహ్లీ తన ఆఖరి టెస్ట్ ఆడాడు.

కొహ్లీ మొత్తం 922 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే.. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్ 913 పాయింట్లతో రెండు, భారత క్రికెట్ నయావాల్ చతేశ్వర్ పూజారా 881 పాయింట్లతో మూడు ర్యాంకుల్లో ఉన్నారు.

టాప్ టెన్ లో జడేజా, అశ్విన్….

బౌలర్ల ర్యాంకింగ్స్ టాప్ టెన్ లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ నిలిచారు. రవీంద్ర జడేజా 6వ ర్యాంకులోనూ, రవిచంద్రన్ అశ్విన్ 10వ ర్యాంకుల్లో ఉన్నారు.

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ యాండర్సన్ కమిన్స్ టాప్ ర్యాంక్ బౌలర్ గా ఉంటే …సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కిర్గీసో రబాడా రెండో ర్యాంక్ లో కొనసాగుతున్నాడు.

ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ లో విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్, బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్, భారత స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మొదటి మూడుస్థానాలలో నిలిచారు.

First Published:  23 July 2019 11:55 AM GMT
Next Story