Telugu Global
Cinema & Entertainment

రికార్డు సృష్టించిన సమంత

స్టార్ హీరోల సినిమాలకు ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ అనేది సాధారణ విషయంగా మారింది. కానీ హీరోయిన్లు నటించిన సినిమాలకు మిలియన్ డాలర్ వసూళ్లంటే అది చెప్పుకోదగ్గ విషయం. అలాంటి ఘనతనే సాధించింది సమంత. ఆమె నటించిన ఓ బేబీ సినిమా ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది. ఈనెల 5న విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ అయింది. సమంత యాక్టింగ్ తో పాటు స్టోరీలైన్ క్లిక్ అవ్వడంతో సినిమాకు […]

రికార్డు సృష్టించిన సమంత
X

స్టార్ హీరోల సినిమాలకు ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ అనేది సాధారణ విషయంగా మారింది. కానీ హీరోయిన్లు నటించిన సినిమాలకు మిలియన్ డాలర్ వసూళ్లంటే అది చెప్పుకోదగ్గ విషయం. అలాంటి ఘనతనే సాధించింది సమంత. ఆమె నటించిన ఓ బేబీ సినిమా ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది.

ఈనెల 5న విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ అయింది. సమంత యాక్టింగ్ తో పాటు స్టోరీలైన్ క్లిక్ అవ్వడంతో సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. అదే సమయంలో ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. అయితే దీనికి 10లక్షల డాలర్ల వసూళ్లు వస్తాయని మాత్రం యూనిట్ ఆశించలేదు. విడుదలైన ఇన్ని రోజులకు ఈ సినిమా ఈ ఘనత సాధించింది.

ఈ సినిమాకు మిలియన్ డాలర్ వసూళ్లు రావడంతో ప్రస్తుతం యూనిట్ సంబరాలు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో మరోసారి సినిమాకు ప్రచారం కల్పించాలని భావిస్తోంది. కానీ ఈ ప్రతిపాదనకు సురేష్ బాబు నో చెప్పినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో ఈ సినిమా రన్ దాదాపు పూర్తయింది. ఇలాంటి సమయంలో మరోసారి ప్రచారం కల్పించడం వల్ల ఉపయోగం ఉండదనేది సురేష్ బాబు అభిప్రాయం. పైగా సమంత కూడా ఈ సినిమాను పక్కనపెట్టి, 96 రీమేక్ పై దృష్టిపెట్టింది.

First Published:  22 July 2019 8:54 PM GMT
Next Story