Telugu Global
NEWS

చారిత్రక బిల్లును టీడీపీ అడ్డుకుంటోంది

ఆంధ్రప్రదేశ్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు నామినేటెడ్ పోస్టులు, ఉద్యోగాలు, కాంట్రాక్టుల విషయంలో రిజర్వేషన్ కల్పించడాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు జీర్ణం చేసుకోలేక పోతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్ధాయిలో విమర్శించారు. “సమాజంలో బడుగు, బలహీన వర్గాలుగా ఉన్న వారు అన్ని రంగాలలోనూ ముందుకు రావడం తెలుగుదేశం పార్టీ వారికి నచ్చడం లేదు. వారు చరిత్ర హీనులుగా మిగిలిపోవడం ఖాయం” అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, […]

చారిత్రక బిల్లును టీడీపీ అడ్డుకుంటోంది
X

ఆంధ్రప్రదేశ్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు నామినేటెడ్ పోస్టులు, ఉద్యోగాలు, కాంట్రాక్టుల విషయంలో రిజర్వేషన్ కల్పించడాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు జీర్ణం చేసుకోలేక పోతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్ధాయిలో విమర్శించారు.

“సమాజంలో బడుగు, బలహీన వర్గాలుగా ఉన్న వారు అన్ని రంగాలలోనూ ముందుకు రావడం తెలుగుదేశం పార్టీ వారికి నచ్చడం లేదు. వారు చరిత్ర హీనులుగా మిగిలిపోవడం ఖాయం” అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, మహిళలకు 50 శాతం నామినేటెడ్ పదవులు, పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు కేటాయిస్తూ సోమవారం ఆంధప్రదేశ్ శాసనసభలో బిల్లు ప్రవేశ్ పెట్టింది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వం.

అయితే ఈ బిల్లును ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేసింది. ప్రతిపక్షం చేస్తున్న ఈ చర్యలపై ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు.

“50 శాతం మైనార్టీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మహిళలకు ఇస్తుంటే అడ్డుకోవడం దిక్కుమాలిన చర్య. దీనిని అడ్డుకోవడం దారుణం. ఇంతటి దిక్కుమాలిన ప్రతిపక్షం దేశంలో ఎక్కడా లేదు” అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు.

ఎక్కడైనా ప్రభుత్వం స్టేట్ మెంట్ ఇస్తుందని, దానిపై ప్రతిపక్షం తన అభిప్రాయాలు చెబుతుందని, అయితే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు.

రాష్ట్ర్రంలో చారిత్రాత్మకమైన బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెడితే దానిని అడ్డుకోవాలని తెలుగుదేశం శాసనసభ్యులు ప్రయత్నించడం బడుగు, బలహీన, మహిళలు, మైనార్టీ వర్గాలపై వారికి ఎంత ప్రేమ ఉందో తెలుస్తోందని వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మండిపడ్డారు.

“అధికారంలో ఉండగా తెలుగుదేశం ప్రభుత్వం చేయలేని పనిని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి మింగుడు పడడం లేదు. వారి చర్యతో తెలుగుదేశం శాసనసభ్యులు చరిత్ర హీనులుగా మిగిలిపోవడం ఖాయం ” అని పలాస ఎమ్మెల్యే డాక్టర్ అప్పల రాజు అన్నారు.

దేశంలో బీసీ, ఎస్పీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలకు ఉన్నతమైన స్ధానం కల్పించేందుకు రూపొందించిన బిల్లును అడ్డుకోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు చరిత్రహీనులుగా మిగిలిపోనున్నారని మరో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు.

First Published:  22 July 2019 5:24 AM GMT
Next Story