Telugu Global
NEWS

తెలంగాణ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ.... వినిపిస్తున్న పేర్లు ఇవే !

తెలంగాణ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణపై ఊహ‌గానాలు మ‌ళ్లీ మొద‌ల‌య్యాయి. ఆషాడ మాసం మరో వారం రోజుల్లో ముగుస్తుంది. మ‌ళ్లీ మంచిరోజులు రాబోతున్నాయి. ఆగ‌స్ట్ 15 నుంచి పాల‌న స్పీడ్ అందుకుంటుంద‌ని కేసీఆర్ ఇప్ప‌టికే హింట్ ఇచ్చారు. ఈ హింట్‌లోనే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ సంకేతాలు కూడా ఉన్నాయ‌ని గులాబీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. మంత్రివ‌ర్గంలో కీల‌క శాఖ‌లైన ఆర్ధిక‌,రెవెన్యూ శాఖ‌ల‌కు మంత్రులు లేరు. అలాగే సాగునీటి పారుదల శాఖ మంత్రి కూడా లేరు. క్యాబినెట్ లో కొన్ని జిల్లాల‌కు ప్రాతినిధ్యం […]

తెలంగాణ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ.... వినిపిస్తున్న పేర్లు ఇవే !
X

తెలంగాణ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణపై ఊహ‌గానాలు మ‌ళ్లీ మొద‌ల‌య్యాయి. ఆషాడ మాసం మరో వారం రోజుల్లో ముగుస్తుంది. మ‌ళ్లీ మంచిరోజులు రాబోతున్నాయి. ఆగ‌స్ట్ 15 నుంచి పాల‌న స్పీడ్ అందుకుంటుంద‌ని కేసీఆర్ ఇప్ప‌టికే హింట్ ఇచ్చారు. ఈ హింట్‌లోనే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ సంకేతాలు కూడా ఉన్నాయ‌ని గులాబీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

మంత్రివ‌ర్గంలో కీల‌క శాఖ‌లైన ఆర్ధిక‌,రెవెన్యూ శాఖ‌ల‌కు మంత్రులు లేరు. అలాగే సాగునీటి పారుదల శాఖ మంత్రి కూడా లేరు. క్యాబినెట్ లో కొన్ని జిల్లాల‌కు ప్రాతినిధ్యం లేదు. ఈ స‌మ‌యంలో క్యాబినెట్ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని తెలుస్తోంది.

ఖ‌మ్మం జిల్లా నుంచి ఒక్క‌రికీ కూడా ప్ర‌స్తుత మంత్రివ‌ర్గంలో స్థానం లేదు. పాలేరులో ఓడిపోయిన తుమ్మ‌ల‌కు మ‌రోసారి చాన్స్ ఇస్తారు అని ఓ ప్రచారం న‌డుస్తోంది.

అయితే పాలేరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కాంగ్రెస్ నేత కందుల ఉపేంద‌ర్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. అప్ప‌టి నుంచి ఆయ‌న‌కు తుమ్మ‌ల వ‌ర్గానికి ప‌డ‌డం లేదు. పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మంలో కూడా గ్రూప్ వార్ న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఉపేంద‌ర్ మీడియాకు ఎక్కారు. తుమ్మ‌ల టార్గెట్‌గా విమ‌ర్శ‌లు గుప్పించారు. గ్రూప్ రాజ‌కీయాల‌తో పార్టీని దెబ్బ తీస్తున్నార‌ని ఆరోపించారు.

అయితే స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య పార్టీలోకి వ‌స్తే మంత్రి ప‌ద‌వి ఆఫ‌ర్ చేస్తార‌ని ఇన్నాళ్లు ప్ర‌చారం న‌డిచింది. కానీ దానిపై ఇంకా క్లారిటీ లేదు.

మ‌రోవైపు మెద‌క్ నుంచి హ‌రీష్‌రావు, ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా నుంచి కేటీఆర్‌ల‌కు బెర్త్‌లు ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఆదిలాబాద్ లేదా వ‌రంగ‌ల్ నుంచి ఓ గిరిజ‌న నేతకు మంత్రి ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి ఇప్ప‌టికే రెండు మంత్రి ప‌ద‌వులు ద‌క్కాయి. ఆ జిల్లాలో మ‌రో నేత‌కు చోటు లేదు.

ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా స‌బితా ఇంద్రారెడ్డికి చాన్స్ ఇచ్చే అవ‌కాశం ఉంది. మొత్తానికి మంత్రివ‌ర్గం విస్త‌ర‌ణ జ‌రిగే అవ‌కాశం మాత్రం స్పష్టంగా నిపిస్తోంది.

First Published:  21 July 2019 8:26 PM GMT
Next Story