Telugu Global
NEWS

92 కి.మీ. రోడ్డుకు 1,872 కోట్లు... అందుకే రుణం రాలేదు

అమరావతి ఒక కుంభకోణాల పుట్ట అని ప్రపంచ బ్యాంకు గుర్తించిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే 3,500 కోట్ల రుణంపై వరల్డ్ బ్యాంకు వెనక్కు వెళ్లిపోయిందన్నారు. ఇంకా రుణం మంజూరు చేయకముందే 92 కిలోమీటర్ల రోడ్డుకు 1,872 కోట్ల అంచనాలతో టెండర్లు ఆమోదించడం అతి పెద్ద కుంభకోణంగా ప్రపంచ బ్యాంకు దర్యాప్తులో వెల్లడైందన్నారు. నారా లోకేష్ సర్వజ్ఞానిగా ఫీల్ అవుతున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇదో మానసిక సమస్య అన్నారు. తండ్రి చాలా కాలం అధికారంలో ఉండడం, […]

92 కి.మీ. రోడ్డుకు 1,872 కోట్లు... అందుకే రుణం రాలేదు
X

అమరావతి ఒక కుంభకోణాల పుట్ట అని ప్రపంచ బ్యాంకు గుర్తించిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే 3,500 కోట్ల రుణంపై వరల్డ్ బ్యాంకు వెనక్కు వెళ్లిపోయిందన్నారు.

ఇంకా రుణం మంజూరు చేయకముందే 92 కిలోమీటర్ల రోడ్డుకు 1,872 కోట్ల అంచనాలతో టెండర్లు ఆమోదించడం అతి పెద్ద కుంభకోణంగా ప్రపంచ బ్యాంకు దర్యాప్తులో వెల్లడైందన్నారు.

నారా లోకేష్ సర్వజ్ఞానిగా ఫీల్ అవుతున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇదో మానసిక సమస్య అన్నారు. తండ్రి చాలా కాలం అధికారంలో ఉండడం, ఒక్కడే సంతానం కావడంతో నారా లోకేష్‌ కూడా ఈ వ్యాధికి లోనై ఉండవచ్చని వ్యాఖ్యానించారు.

First Published:  22 July 2019 2:08 AM GMT
Next Story