Telugu Global
Cinema & Entertainment

'కన్నుకొట్టి' పాట విడుదలైంది

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న శర్వానంద్ తాజాగా దర్శకుడు సుధీర్ వర్మ తో చేతులు కలిపి ‘రణరంగం’ అనే యాక్షన్ డ్రామా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. 1980ల బాక్ డ్రాప్ తో సాగే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మరియు కల్యాణి ప్రియదర్శన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా సినిమాకి సంబంధించిన రెండవ పాట ‘కన్నుకొట్టి చూసెనంట […]

కన్నుకొట్టి పాట విడుదలైంది
X

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న శర్వానంద్ తాజాగా దర్శకుడు సుధీర్ వర్మ తో చేతులు కలిపి ‘రణరంగం’ అనే యాక్షన్ డ్రామా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

1980ల బాక్ డ్రాప్ తో సాగే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మరియు కల్యాణి ప్రియదర్శన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా సినిమాకి సంబంధించిన రెండవ పాట ‘కన్నుకొట్టి చూసెనంట సుందరి’ లిరికల్ వీడియో ని విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

ఈ పాట వింటుంటేనే సంగీత దర్శకుడు కార్తిక్ రోడ్రిగీజ్ ఈ సినిమాకి చాలా మంచి మ్యూజిక్ ని అందించారని చెప్పుకోవచ్చు. అతని గొంతు కూడా పాటకి మరింత ఎనర్జీ ని తెచ్చిపెట్టింది. కృష్ణ చైతన్య లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి.

ఇంతకుముందు విడుదలైన ‘కల్యాణ వైభోగమే’ లిరికల్ వీడియో లాగా ఈ పాట లిరికల్ వీడియో కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను అందుకుంటోంది. సూర్యదేవర నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల కాబోతోంది.

First Published:  20 July 2019 8:22 PM GMT
Next Story