ఫేస్ యాప్‌తో యమ డేంజర్.... నిపుణుల హెచ్చరిక !
హాలీవుడ్ కాదు… బాలీవుడే కాదు… టాలీవుడే కాదు… ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా ‘ఫేస్ యాప్’ హవా నడుస్తోంది. సెలబ్రెటీల నుంచి కాలేజీ స్టూడెంట్స్ దాకా…టీవీ యాంకర్ల నుంచి ఇంట్లో ఉండే గృహిణిల దాకా ఈ యాప్ ఉపయోగిస్తున్నారు. తాము ఈ ఏజ్‌లో ఎలా ఉన్నాం? ఏజ్ పెరిగి ముసలి వాళ్లు అయితే ఎలా ఉంటాం? అని ఫొటోల ద్వారా ఈ యాప్‌లో చూసుకుంటున్నారు. మన్మథుడు2 సినిమా ప్రమోషన్‌లో భాగంగా నాగార్జున ఫొటో కూడా పేస్ యాప్ ద్వారా […]

హాలీవుడ్ కాదు… బాలీవుడే కాదు… టాలీవుడే కాదు… ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా ‘ఫేస్ యాప్’ హవా నడుస్తోంది. సెలబ్రెటీల నుంచి కాలేజీ స్టూడెంట్స్ దాకా…టీవీ యాంకర్ల నుంచి ఇంట్లో ఉండే గృహిణిల దాకా ఈ యాప్ ఉపయోగిస్తున్నారు. తాము ఈ ఏజ్‌లో ఎలా ఉన్నాం? ఏజ్ పెరిగి ముసలి వాళ్లు అయితే ఎలా ఉంటాం? అని ఫొటోల ద్వారా ఈ యాప్‌లో చూసుకుంటున్నారు.
మన్మథుడు2 సినిమా ప్రమోషన్‌లో భాగంగా నాగార్జున ఫొటో కూడా పేస్ యాప్ ద్వారా తీసిన 3 ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 2002లో వచ్చిన మన్మథుడుకి ఇప్పటి మన్మథుడికి తేడా లేదని…మరో పదేళ్లయినా నాగ్‌లో మార్పు రాదని హీరోయిన్లు చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇప్పుడు సోషల్ మీడియాలో జనం తీసుకుంటున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తాము ముసలివాళ్లైపోతే ఎలా ఉంటామో, ఆ ఫొటోలను ఈ యాప్ ద్వారా చూసుకుంటున్నారు.
అయితే ఇలా చూసుకునే క్రమంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని జనం గమనించడం లేదు. రాబోయే కాలంలో డేంజర్లో పడతామని సృహ ఉండడం లేదు.
ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఫొటోలు అప్‌లోడ్ చేయమని అడుగుతుంది. ఆ తర్వాత మీ గ్యాలరీలో ఎంట్రీ కావడానికి పర్మిషన్లు ఇస్తారు. మీ గ్యాలరీలో ఉన్న సమాచారంతో పాటు యాప్ ద్వారా నోటిఫికేషన్లకు మీరు సమాధానం ఇస్తే…మీ ఇష్టాఇష్టాలు, మీ డేటా మొత్తం యాప్‌లోకి ఎంట్రీ అయిపోతుంది. మీరు అప్‌లోడ్ చేసిన ఫొటోలు ఆ తర్వాత వారు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు.
ఈ యాప్‌పై అమెరికా సెనేట్‌లో అక్కడి సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పేస్ యాప్‌పై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అమెరికా పౌరుల వ్యక్తిగత డేటా రష్యా కంపెనీ చేతిలో పడిందని… ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సెనేట్ సభ్యులు సూచించారు. ఈ యాప్‌పై దర్యాప్తు చేయాలని కొందరు సభ్యులు కోరారు.
అయితే పేస్ యాప్ కంపెనీ వైర్‌లెస్ ల్యాబ్ మాత్రం…తాము పౌరుల వ్యక్తిగత డేటా సేకరించడం లేదని అంటోంది. కేవలం యూజర్స్ ఎంచుకునే ఫొటోలోనే ఎడిటింగ్ చేస్తామని చెబుతోంది. అయితే ఎంతైనా ఇలాంటి యాప్‌ల వల్ల డేంజర్ ఉంటుందని… పౌరులు జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.