Telugu Global
Cinema & Entertainment

పూరి జగన్నాథ్, చార్మి పై కేసు పెడతా " కమెడియన్ భద్రం

మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్న భద్రం తాజాగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ పైన, ఒకప్పటి నటి చార్మి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరిపై కేసులు పెడతానంటూ భద్రం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజానికి సినిమాల్లోకి రాకముందు భద్రం గూగుల్ వంటి మల్టీనేషనల్ కంపెనీలలో కన్సల్టింగ్ డాక్టర్ గా పనిచేసేవారు. అప్పుడే ఆయన చేసిన ఏడు నిమిషాల షార్ట్ ఫిల్మ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా […]

పూరి జగన్నాథ్, చార్మి పై కేసు పెడతా  కమెడియన్ భద్రం
X

మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్న భద్రం తాజాగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ పైన, ఒకప్పటి నటి చార్మి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరిపై కేసులు పెడతానంటూ భద్రం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నిజానికి సినిమాల్లోకి రాకముందు భద్రం గూగుల్ వంటి మల్టీనేషనల్ కంపెనీలలో కన్సల్టింగ్ డాక్టర్ గా పనిచేసేవారు. అప్పుడే ఆయన చేసిన ఏడు నిమిషాల షార్ట్ ఫిల్మ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది చూసిన పూరి జగన్నాథ్ ఒక సినిమాలో భద్రం కి అవకాశం ఇచ్చారు. అప్పటినుంచి భద్రం పూరి జగన్నాధ్ ని గాడ్‌ ఫాదర్ లా భావించేవాడు.

తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చూసి వచ్చిన భద్రం సినిమా ఎలా ఉందో వెరైటీగా స్పందించాడు. “నేను పూరి జగన్నాథ్, చార్మి మేడం పైన కేసు పెడదాము అనుకుంటున్నాను. ఎందుకంటే నేను రోజూ మెడిటేషన్ చేసే వాడిని. కానీ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చూసిన తర్వాత మెడిటేషన్ చేయడం కుదరలేదు. అయినా పర్లేదు అనిపిస్తుంది. మీరు కూడా సినిమా చూసి ఎంజాయ్ చేయండి” అంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు భద్రం.

అయితే సినిమాలో రామ్ క్యారెక్టర్ ఎంత బలంగా ఉందంటే సినిమా నుంచి బయటికి వచ్చాక కూడా మెడిటేషన్ చేయడం కుదరలేదని చెప్పడం అతని ఉద్దేశం అన్నమాట. మరి దీనికి పూరి జగన్నాథ్, ఛార్మి ఎంత హ్యాపీగా రియాక్ట్ అవుతారో చూడాలి.

First Published:  19 July 2019 11:41 PM GMT
Next Story