Telugu Global
NEWS

పాస్టర్ల ప్రభుత్వ జీతాల కోసం రంగంలోకి బ్రోకర్లు

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో చర్చి పాస్టర్లకు జీతాలు ఇవ్వాలని జగన్ మోహన్‌ రెడ్డి నిర్ణయించడం, ఆ విషయాన్ని బడ్జెట్‌లో కూడా వెల్లడించిన నేపథ్యంలో లాబీయింగ్‌లు మొదలయ్యాయి. నెలకు పాస్టర్లకు 5వేల రూపాయల చొప్పున ఇచ్చి ప్రోత్సహించాలని జగన్‌ మోహన్ రెడ్డి నిర్ణయించడంతో…. పాస్టర్లుగా ఐదు వేలు తీసుకునేందుకు కొందరు అడ్డదారుల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు బ్రోకర్లు రంగంలోకి దిగి తాము ప్రభుత్వం నుంచి ఐదు వేలు వచ్చేలా చేస్తామంటూ అనర్హుల వద్ద నుంచి డబ్బులు […]

పాస్టర్ల ప్రభుత్వ జీతాల కోసం రంగంలోకి బ్రోకర్లు
X

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో చర్చి పాస్టర్లకు జీతాలు ఇవ్వాలని జగన్ మోహన్‌ రెడ్డి నిర్ణయించడం, ఆ విషయాన్ని బడ్జెట్‌లో కూడా వెల్లడించిన నేపథ్యంలో లాబీయింగ్‌లు మొదలయ్యాయి.

నెలకు పాస్టర్లకు 5వేల రూపాయల చొప్పున ఇచ్చి ప్రోత్సహించాలని జగన్‌ మోహన్ రెడ్డి నిర్ణయించడంతో…. పాస్టర్లుగా ఐదు వేలు తీసుకునేందుకు కొందరు అడ్డదారుల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు బ్రోకర్లు రంగంలోకి దిగి తాము ప్రభుత్వం నుంచి ఐదు వేలు వచ్చేలా చేస్తామంటూ అనర్హుల వద్ద నుంచి డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల వద్ద పలుకుబడి ఉందని చెబుతూ వసూళ్లకు పాల్పడుతున్నారు.

ఈ వ్యవహారం ప్రభుత్వం వరకు వెళ్లింది. దీంతో క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ఎండీ ఏసురత్నం ద్వారా ప్రభుత్వం స్పష్టత ఇప్పించింది. పాస్టర్లకు ప్రభుత్వం 5వేలు ఇచ్చే పథకం కింద లబ్ది జరిగేలా చూస్తామంటూ కొందరు వ్యక్తులు పాస్టర్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని… అలాంటి వారిని నమ్మవద్దని ఏసురత్నం సూచించారు.

పాస్టర్లకు జీతాలు ఇచ్చే విషయమై ప్రభుత్వం విధి విధానాలను రూపొందిస్తోందని… ప్రభుత్వం నుంచి పూర్తి స్పష్టత వచ్చే వరకు బ్రోకర్ల మాటలు నమ్మవద్దని సూచించారు.

First Published:  19 July 2019 8:25 PM GMT
Next Story