Telugu Global
Cinema & Entertainment

పూర్, రిచ్.... ఇప్పుడు మిడిల్ క్లాస్..... హిట్ కోసం అఖిల్ పాట్లు

అఖిల్ అక్కినేని తన కెరీర్ లో మొదట చేసిన సోలో సినిమా ‘అఖిల్’. ఆ తర్వాత చేసిన సినిమాలు హలో, మిస్టర్ మజ్ను. ‘అఖిల్’ సినిమాలో అనాధ పాత్ర చేసినా…. సినిమా కథ మరీ టూ మచ్ గా ఉండటం తో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.  ఇక తర్వాత చేసిన రెండు సినిమాల్లో అఖిల్ స్టైలిష్ గా, ఒక రిచ్ పర్సన్ లాగా కనిపించాడు. అయినా కూడా ఈ సినిమాలు […]

పూర్, రిచ్.... ఇప్పుడు మిడిల్ క్లాస్..... హిట్ కోసం అఖిల్ పాట్లు
X

అఖిల్ అక్కినేని తన కెరీర్ లో మొదట చేసిన సోలో సినిమా ‘అఖిల్’. ఆ తర్వాత చేసిన సినిమాలు హలో, మిస్టర్ మజ్ను. ‘అఖిల్’ సినిమాలో అనాధ పాత్ర చేసినా…. సినిమా కథ మరీ టూ మచ్ గా ఉండటం తో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.

ఇక తర్వాత చేసిన రెండు సినిమాల్లో అఖిల్ స్టైలిష్ గా, ఒక రిచ్ పర్సన్ లాగా కనిపించాడు. అయినా కూడా ఈ సినిమాలు ప్లాప్ అవ్వడం తో అఖిల్ ఒక సెల్ఫ్ అనాలసిస్ చేసుకున్నాడట.

అయితే తన సినిమాల్లో కథలు బాగుంటున్నాయి గానీ…. పోషించే పాత్రలు అందరినీ మెప్పించే రేంజ్ లో లేవని రివ్యూ చేసుకున్నాడట. అందుకే ఈ సారి ఒక మిడిల్ క్లాస్ కుటుంబం లో కుర్రాడి గా అఖిల్ నటించనున్నాడట.

ఈ సినిమా కి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సారి అఖిల్ తన వయసుకు తగిన పాత్ర పోషించడం తో పాటు మంచి కథ తో కూడా మెప్పించనున్నాడట.

నాలుగో సినిమా తో అయినా హిట్ కొట్టి ఈ సారి ప్రేక్షకులని మెప్పించాలని అఖిల్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.

First Published:  18 July 2019 12:37 AM GMT
Next Story