Telugu Global
Cinema & Entertainment

జగపతిబాబు అవుట్... ప్రకాష్ రాజ్ ఇన్

మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న విషయం మనకి తెలిసిందే. చిత్ర యూనిట్ ప్రస్తుతం కాశ్మీర్ లో ఒక ముఖ్యమైన షెడ్యూల్ ని షూట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా లో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు కూడా ఒక భాగం అని చిత్ర యూనిట్ ఎప్పుడో తెలిపింది. కాకపోతే ఇప్పుడు తాజా సమాచారం మేరకు ఈ సినిమా నుండి జగపతి బాబు […]

జగపతిబాబు అవుట్... ప్రకాష్ రాజ్ ఇన్
X

మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న విషయం మనకి తెలిసిందే.

చిత్ర యూనిట్ ప్రస్తుతం కాశ్మీర్ లో ఒక ముఖ్యమైన షెడ్యూల్ ని షూట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా లో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు కూడా ఒక భాగం అని చిత్ర యూనిట్ ఎప్పుడో తెలిపింది.

కాకపోతే ఇప్పుడు తాజా సమాచారం మేరకు ఈ సినిమా నుండి జగపతి బాబు వైదొలిగారట. ఈ సినిమా లో ప్రస్తుతం జగపతి బాబు పనిచేయడం లేదని తెలుస్తోంది. కొన్ని అనివార్య కారణాల వలన ఆయన ఈ సినిమా వదులుకోనున్నట్లు సమాచారం.

అయితే జగపతి బాబు స్థానం లో ప్రకాష్ రాజ్ ని ఈ సినిమా లో కి తీసుకున్నారట చిత్ర యూనిట్. త్వరలో నే ఈ సినిమా షూటింగ్ లో ప్రకాష్ రాజ్ పాల్గొననున్నారు.

ఈ విషయమై ఒక అధికారిక ప్రకటన కూడా త్వరలో వెలువడనుంది. ఈ సినిమా ని అనిల్ సుంకర మరియు దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తోంది.

First Published:  16 July 2019 2:41 AM GMT
Next Story