Telugu Global
Cinema & Entertainment

ఛార్మి కి లెక్క సెటిల్ చేసిన... పూరి

జ్యోతి లక్ష్మి సినిమా నుంచి పూరి జగన్నాథ్, ఛార్మి మరింత దగ్గరయ్యారు. ఇద్దరూ కలిసి బిజినెస్ పార్టనర్స్ గా కూడా మారారు. అయితే ఇప్పటి దాకా ఈ ఇద్దరూ కలిసి నిర్మించిన సినిమాల్లో పెద్దగా లాభాలు రాలేదు. మొన్నామధ్య పూరి తన కొడుకు ఆకాష్ తో చేసిన సినిమా మెహబూబా కి పూరి తో పాటు ఛార్మి కూడా డబ్బులు పెట్టింది… కానీ కొన్ని అనుకోని కారణాల వలన ఆ సినిమా ఓవర్ బడ్జెట్ అవ్వడమే కాకుండా […]

ఛార్మి కి లెక్క సెటిల్ చేసిన... పూరి
X

జ్యోతి లక్ష్మి సినిమా నుంచి పూరి జగన్నాథ్, ఛార్మి మరింత దగ్గరయ్యారు. ఇద్దరూ కలిసి బిజినెస్ పార్టనర్స్ గా కూడా మారారు.

అయితే ఇప్పటి దాకా ఈ ఇద్దరూ కలిసి నిర్మించిన సినిమాల్లో పెద్దగా లాభాలు రాలేదు. మొన్నామధ్య పూరి తన కొడుకు ఆకాష్ తో చేసిన సినిమా మెహబూబా కి పూరి తో పాటు ఛార్మి కూడా డబ్బులు పెట్టింది… కానీ కొన్ని అనుకోని కారణాల వలన ఆ సినిమా ఓవర్ బడ్జెట్ అవ్వడమే కాకుండా డబ్బులు కూడా రాలేదు.

అయితే ఆ తర్వాత పూరి తో పని చెయ్యడానికి ఎవ్వరూ పెద్దగా ఇష్టపడక పోయేసరికి పూరి కోసం ఛార్మి రామ్ డేట్స్ పట్టుకొని ఇస్మార్ట్ శంకర్ కి శ్రీకారం చుట్టింది.

అయితే ఈ సినిమా కి కూడా పూరి తో పాటు ఛార్మి డబ్బు పెట్టింది. సినిమా మీద అంచనాలు పెంచుతూ… మంచి బజ్ మైంటైన్ అయ్యేలా చేసిన ఛార్మి…. మొత్తానికి సినిమాకి టేబుల్ ప్రాఫిట్ వచ్చేలా ప్లాన్ చేసింది.

ఈ సినిమా ఇప్పుడు టేబుల్ ప్రాఫిట్ కావడం తో ఛార్మి పెట్టిన మొత్తం ఈ పాటికే వచ్చేసిందట. ఆ విధంగా పూరి మెహబూబా కి ఛార్మి పోగొట్టుకున్న డబ్బు కూడా తిరిగి ఇచ్చేశాడని చెబుతున్నారు.

First Published:  15 July 2019 4:14 AM GMT
Next Story