Telugu Global
Cinema & Entertainment

ఎట్టకేలకు సెట్స్ పైకొచ్చిన అఖిల్

హలో ఫ్లాప్ తర్వాత మిస్టర్ మజ్నును సెట్స్ పైకి తీసుకురావడానికి చాలా టైం తీసుకున్నాడు అఖిల్. కానీ మిస్టర్ మజ్ను ఫ్లాప్ తర్వాత నెక్ట్ సినిమా స్టార్ట్ చేయడానికి పెద్దగా టైమ్ తీసుకోలేదు. దాదాపు 2 నెలల కిందటే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా లాంఛ్ చేశాడు అఖిల్. ఇప్పుడా సినిమా సెట్స్ పైకి వచ్చింది. అఖిల్ నాలుగో సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభమైంది. అఖిల్, కమెడియన్ ప్రియదర్శితో పాటు మరికొంతమంది క్యారెక్టర్ […]

ఎట్టకేలకు సెట్స్ పైకొచ్చిన అఖిల్
X

హలో ఫ్లాప్ తర్వాత మిస్టర్ మజ్నును సెట్స్ పైకి తీసుకురావడానికి చాలా టైం తీసుకున్నాడు అఖిల్. కానీ మిస్టర్ మజ్ను ఫ్లాప్ తర్వాత నెక్ట్ సినిమా స్టార్ట్ చేయడానికి పెద్దగా టైమ్ తీసుకోలేదు. దాదాపు 2 నెలల కిందటే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా లాంఛ్ చేశాడు అఖిల్. ఇప్పుడా సినిమా సెట్స్ పైకి వచ్చింది.

అఖిల్ నాలుగో సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభమైంది. అఖిల్, కమెడియన్ ప్రియదర్శితో పాటు మరికొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులపై ఈరోజు కొన్ని సన్నివేశాలు తీశారు. ఈ సినిమాకు సంబంధించి ఇంకా హీరోయిన్ ను ఫిక్స్ చేయలేదు. అందుకే సినిమా సెట్స్ పైకి రావడం ఆలస్యమైంది. ఎప్పటికీ హీరోయిన్ ఫిక్స్ అవ్వకపోవడంతో.. ఆమె ఎవరో తెలియకుండానే ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. హీరోయిన్ ఫైనలైజ్ అయిన తర్వాత రెండో షెడ్యూల్ స్టార్ట్ చేస్తారు.

గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తుండగా, అల్లు అరవింద్ సమర్పిస్తున్నాడు. సినిమాలో జగపతిబాబు, ప్రకాష్ రాజ్ రెండు కీలక పాత్రలు పోషించబోతున్నారు. ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాను నవంబర్ లో థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.

First Published:  15 July 2019 9:00 AM GMT
Next Story