Telugu Global
Cinema & Entertainment

'ఓ బేబీ' సక్సెస్..... నందినీ రెడ్డికి అల్లు అరవింద్ శుభాకాంక్షలు

అక్కినేని సమంత ఈ మధ్యనే ‘ఓ బేబీ’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సౌత్ కొరియన్ సూపర్ హిట్ సినిమా ‘మిస్ గ్రానీ’ కి రీమేక్ గా విడుదలైన ఈ సినిమాకి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటూ బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అభిమానులే కాక సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాలో సమంత నటనను […]

ఓ బేబీ సక్సెస్..... నందినీ రెడ్డికి అల్లు అరవింద్ శుభాకాంక్షలు
X

అక్కినేని సమంత ఈ మధ్యనే ‘ఓ బేబీ’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సౌత్ కొరియన్ సూపర్ హిట్ సినిమా ‘మిస్ గ్రానీ’ కి రీమేక్ గా విడుదలైన ఈ సినిమాకి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటూ బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అభిమానులే కాక సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాలో సమంత నటనను మెచ్చుకుంటున్నారు. ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ పై చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు మెగా నిర్మాత అల్లు అరవింద్.

తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్… నందిని రెడ్డి ని కలిసి ఒక బొకే ఇచ్చి సినిమా సక్సెస్ అయినందుకు శుభాకాంక్షలు చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

గతంలో సమంత నటించిన ‘మహానటి’ సినిమా సక్సెస్ అయినప్పుడు కూడా అల్లు అర్జున్ చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

First Published:  13 July 2019 10:46 PM GMT
Next Story