Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్ 'ఓ.. బేబీ'.... అలియా భట్ !

ఈ మధ్యనే సురేష్ బాబు ప్రొడక్షన్స్ పతాకంపై అక్కినేని సమంత హీరోయిన్ గా ‘ఓ.. బేబీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సౌత్ కొరియన్ సినిమా ‘మిస్ గ్రానీ’ కి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా ని సురేష్ బాబు హిందీ లో కూడా విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రానా దగ్గుబాటి ఇప్పటికే బాలీవుడ్ లోని […]

బాలీవుడ్ ఓ.. బేబీ.... అలియా భట్ !
X

ఈ మధ్యనే సురేష్ బాబు ప్రొడక్షన్స్ పతాకంపై అక్కినేని సమంత హీరోయిన్ గా ‘ఓ.. బేబీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సౌత్ కొరియన్ సినిమా ‘మిస్ గ్రానీ’ కి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా ని సురేష్ బాబు హిందీ లో కూడా విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో రానా దగ్గుబాటి ఇప్పటికే బాలీవుడ్ లోని కొందరు ప్రముఖులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇప్పటికే వారికి రానా దగ్గుబాటి ఈ సినిమాని కూడా చూపించాడట.

ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం అలియా భట్ అయితే బాగుంటుందని, హీరోయిన్ పాత్రలో అలియాభట్ అయితే పూర్తి స్థాయిలో న్యాయం చేయగలుగుతుందని సురేష్ బాబు అభిప్రాయ పడుతున్నారు.

ఈ నేపథ్యంలో త్వరలో రానా దగ్గుపాటి లేదా సురేష్ బాబు అలియా భట్ ను సంప్రదించ బోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న అలియా భట్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతోంది.

ఈ మధ్యనే తన పాత్ర తాలూకు షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఆలియాభట్ బాలీవుడ్ లో కూడా పలు పెద్ద సినిమాలతో బిజీగా ఉంది. మరి ఈమె ‘ఓ… బేబీ’ రీమేక్ కోసం ఒప్పుకుంటుందో లేదో వేచి చూడాలి.

First Published:  12 July 2019 4:00 AM GMT
Next Story