Telugu Global
Cinema & Entertainment

16 రోజుల్లో 225 కోట్లు... తెలుగు డైరెక్ట‌ర్ సంచ‌ల‌నం !

టాలీవుడ్ డైరెక్ట‌ర్ స‌త్తా ఏంటో తెలిసింది. బాలీవుడ్‌లో ఇప్పుడు ఒక‌టే చ‌ర్చ‌. టాప్ హీరోల సినిమాలు ప‌క్క‌న‌పెట్టారు. ఖాన్‌లను చూడ‌లేదు. బాలీవుడ్ సినిమాటిక్ లేదు. కానీ క‌లెక్ష‌న్లు మాత్రం కొల్ల‌గొడుతోంది. తెలుగు డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా సృష్టించిన చ‌రిత్ర ఇది. అర్జున్ రెడ్డితో తెలుగు మార్కెట్‌ను కొల్ల‌గొట్టారు. టాలీవుడ్‌కు కొత్తి సినిమా చూపించాడు. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా కొత్త పాఠాలు నేర్పుతున్నాడు. అర్జున్ రెడ్డి ఇక్క‌డ ఎంత సంచ‌ల‌న‌మైందో…ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా అదే వైబ్రేష‌న్స్ తీసుకొస్తోంది. […]

16 రోజుల్లో 225 కోట్లు... తెలుగు డైరెక్ట‌ర్ సంచ‌ల‌నం !
X

టాలీవుడ్ డైరెక్ట‌ర్ స‌త్తా ఏంటో తెలిసింది. బాలీవుడ్‌లో ఇప్పుడు ఒక‌టే చ‌ర్చ‌. టాప్ హీరోల సినిమాలు ప‌క్క‌న‌పెట్టారు. ఖాన్‌లను చూడ‌లేదు. బాలీవుడ్ సినిమాటిక్ లేదు. కానీ క‌లెక్ష‌న్లు మాత్రం కొల్ల‌గొడుతోంది. తెలుగు డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా సృష్టించిన చ‌రిత్ర ఇది.

అర్జున్ రెడ్డితో తెలుగు మార్కెట్‌ను కొల్ల‌గొట్టారు. టాలీవుడ్‌కు కొత్తి సినిమా చూపించాడు. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా కొత్త పాఠాలు నేర్పుతున్నాడు. అర్జున్ రెడ్డి ఇక్క‌డ ఎంత సంచ‌ల‌న‌మైందో…ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా అదే వైబ్రేష‌న్స్ తీసుకొస్తోంది. విమ‌ర్శ‌లు ఒక‌వైపు వ‌స్తే….మ‌రోవైపు అదే రితీలో క‌లెక్ష‌న్లు కూడా కురుస్తున్నాయి.

క‌బీర్‌సింగ్ విడుద‌లై 16 రోజులైంది. కానీ 225 కోట్ల క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. బాలీవుడ్‌లో సంచ‌ల‌నంగా మారిన ఈ సినిమా వీకెండ్ శ‌నివారం 7 కోట్ల 50 ల‌క్ష‌లు వసూళ్లు రాబ‌ట్టింది. మూడు వారాలు ముగుస్తున్నా సినిమా క‌లెక్ష‌న్లు స్ట‌డీగా ఉన్నాయ‌డానికి ఈ వ‌సూళ్లే రుజువు.

పద్మావ‌తి, సుల్తాన్‌, సంజు, టైగ‌ర్ జిందా హై, బాజ‌రంగీ బాయ్‌జాన్‌ల‌ను మించి మూడో వారంలో ఈ సినిమా ఆడుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. క‌బీర్ సింగ్ వ‌సూళ్లు ఒక‌సారి చూస్తే….

3వ రోజు -50 కోట్లు
5వ‌రోజు- 100 కోట్లు
7వ రోజు- 125 కోట్లు
9వ రోజు- 150 కోట్లు
10వ రోజు- 175 కోట్లు
13వ రోజు- 200 కోట్లు
16వ రోజు- 225 కోట్లు

క‌బీర్‌సింగ్ 16 రోజుల్లోనే 225 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్లు సాధించింది.

First Published:  7 July 2019 7:58 PM GMT
Next Story