Telugu Global
Cinema & Entertainment

అఖిల్-భాస్కర్ సినిమా.... సముద్రఖని పాత్ర ఇదేనట !

అక్కినేని అఖిల్ ఇప్పటికే మూడు సినిమాలలో నటించాడు…. కానీ అందులో ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు.. ఈ మధ్యనే ‘మిస్టర్ మజ్ను’ అనే సినిమాతో మరొక డిజాస్టర్ ను అందుకున్న అఖిల్ ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో ఒక్క పాపులర్ తమిళ నటుడు అఖిల్ తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. ఆయన ఎవరో కాదు సముద్రఖని. తాజాగా ఎన్టీఆర్-రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ […]

అఖిల్-భాస్కర్ సినిమా.... సముద్రఖని పాత్ర ఇదేనట !
X

అక్కినేని అఖిల్ ఇప్పటికే మూడు సినిమాలలో నటించాడు…. కానీ అందులో ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు..

ఈ మధ్యనే ‘మిస్టర్ మజ్ను’ అనే సినిమాతో మరొక డిజాస్టర్ ను అందుకున్న అఖిల్ ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమాలో ఒక్క పాపులర్ తమిళ నటుడు అఖిల్ తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. ఆయన ఎవరో కాదు సముద్రఖని.

తాజాగా ఎన్టీఆర్-రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’ తో మొట్టమొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నాడు సముద్రఖని.

ఇప్పుడు ఈ ప్రముఖ తమిళ నటుడు… అఖిల్ కి తండ్రిగా నటించబోతున్నాడు. ఇప్పటిదాకా ప్రకాష్ రాజ్, జగపతిబాబు, సత్యరాజ్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ వంటి నటులు తండ్రి పాత్రలు పోషిస్తుండగా ఇప్పుడు ప్రముఖ తమిళ నటుడు కూడా తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారబోతున్నాడు.

వరుసగా మూడు డిజాస్టర్ లు అందుకున్న అక్కినేని అఖిల్ ఈ సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. మరి కనీసం నాలుగవ సినిమాతో అయినా అఖిల్ ఖాతా తెరుస్తాడో లేదో చూడాలి.

First Published:  8 July 2019 2:12 AM GMT
Next Story