Telugu Global
CRIME

నేనే రాంప్రసాద్‌ను హత్య చేశా " మీడియాకు హంతకుడి ఇంటర్వ్యూ

బెజవాడకు చెందిన వ్యాపారి రాంప్రసాద్‌ హత్య కేసు దర్యాప్తును తెలంగాణ పోలీసులు వేగవంతం చేశారు. హైదరాబాద్ పంజాగుట్టలో రాంప్రసాద్‌ హత్య జరిగింది. స్టేషన్‌కు సమీపంలోనే హత్య జరిగిన నేపథ్యంలో స్థానిక పోలీసులపై తెలంగాణ డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. దాంతో పలు బృందాలు రంగంలోకి దిగాయి. ఇంతలో తాను హత్య చేశానంటూ శ్యాం అనే వ్యక్తి మీడియా ముందుకొచ్చాడు. తానే రాంప్రసాద్‌ను హత్య చేసినట్టు చెప్పాడు. 15 రోజుల పాటు రెక్కీ నిర్వహించి మరీ […]

నేనే రాంప్రసాద్‌ను హత్య చేశా  మీడియాకు హంతకుడి ఇంటర్వ్యూ
X

బెజవాడకు చెందిన వ్యాపారి రాంప్రసాద్‌ హత్య కేసు దర్యాప్తును తెలంగాణ పోలీసులు వేగవంతం చేశారు. హైదరాబాద్ పంజాగుట్టలో రాంప్రసాద్‌ హత్య జరిగింది. స్టేషన్‌కు సమీపంలోనే హత్య జరిగిన నేపథ్యంలో స్థానిక పోలీసులపై తెలంగాణ డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. దాంతో పలు బృందాలు రంగంలోకి దిగాయి.

ఇంతలో తాను హత్య చేశానంటూ శ్యాం అనే వ్యక్తి మీడియా ముందుకొచ్చాడు. తానే రాంప్రసాద్‌ను హత్య చేసినట్టు చెప్పాడు. 15 రోజుల పాటు రెక్కీ నిర్వహించి మరీ రాంప్రసాద్‌ను హత్య చేసినట్టు శ్యాం వివరించాడు. తనతో పాటు మరో ముగ్గురు ఈ హత్యలో పాల్గొన్నట్టుగా వెల్లడించాడు.

2013లో రాంప్రసాద్‌ తప్పుడు కేసు పెట్టి తనను 15 రోజులు రిమాండ్‌కు పంపించాడని శ్యాం చెప్పాడు. రాంప్రసాద్ వల్ల తనకు 15 లక్షలు నష్టం వచ్చిందన్నాడు. రాంప్రసాద్‌ను హత్య చేస్తే 15 లక్షల డబ్బులు తనకు వస్తాయని అతడి బామ్మర్ధి ఊర శ్రీనివాస్ గతంలో తనకు చెప్పాడన్నాడు.

రాంప్రసాద్‌ను హత్య చేస్తే అందరూ కోగంటి సత్యంను అనుమానిస్తారని రాంప్రసాద్ బామ్మర్ది చెప్పాడన్నాడు. తాను పంజాగుట్ట పోలీసుల ముందు లొంగిపోతున్నట్టు చెప్పాడు.

తన శిష్యులు చోటు, రమేష్‌తో కలిసి హత్య చేసినట్టు వివరించాడు. ఈ హత్యతో కోగంటి సత్యంకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించాడు.

తనపై తప్పుడు కేసులు పెట్టి రాంప్రసాద్ చిత్రహింసలు పెట్టాడని… అందుకే ఈ హత్య చేసినట్టు చెప్పాడు. రాంప్రసాద్‌ ఎక్కడ ఉంటాడన్నది అడ్రస్ ఇచ్చింది కూడా ఊర శ్రీనివాసేనన్నాడు.

First Published:  8 July 2019 7:55 AM GMT
Next Story