Telugu Global
Cinema & Entertainment

రాజుగారి గది-3... వెనక్కి తగ్గుతున్న భామలు

రాజుగారి గది-3కి సంబంధించిన మేటర్ ఇది. తమన్నాను హీరోయిన్ గా పెట్టి ఈ సినిమాను గ్రాండ్ గా ఎనౌన్స్ చేశారు. ప్రారంభోత్సవానికి మిల్కీబ్యూటీ కూడా వచ్చింది. కట్ చేస్తే, కొన్ని రోజులకే ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకుంది. బాలీవుడ్ ఆఫర్ రావడమే దీనికి కారణం. ఆ తర్వాత ఆ స్థానాన్ని ఏ హీరోయిన్ తో భర్తీ చేయాలని భావిస్తున్నప్పటికీ.. దర్శకుడు కమ్ నిర్మాత ఓంకార్ కు చుక్కెదురు అవుతోంది. తమన్న తప్పుకున్న వెంటనే కాజల్ ను […]

రాజుగారి గది-3... వెనక్కి తగ్గుతున్న భామలు
X

రాజుగారి గది-3కి సంబంధించిన మేటర్ ఇది. తమన్నాను హీరోయిన్ గా పెట్టి ఈ సినిమాను గ్రాండ్ గా ఎనౌన్స్ చేశారు. ప్రారంభోత్సవానికి మిల్కీబ్యూటీ కూడా వచ్చింది. కట్ చేస్తే, కొన్ని రోజులకే ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకుంది. బాలీవుడ్ ఆఫర్ రావడమే దీనికి కారణం. ఆ తర్వాత ఆ స్థానాన్ని ఏ హీరోయిన్ తో భర్తీ చేయాలని భావిస్తున్నప్పటికీ.. దర్శకుడు కమ్ నిర్మాత ఓంకార్ కు చుక్కెదురు అవుతోంది.

తమన్న తప్పుకున్న వెంటనే కాజల్ ను సంప్రదించాడు ఓంకార్. ఆమెకు కూడా స్టోరీ నచ్చింది. కానీ కాల్షీట్లు ఖాళీ లేవని చెప్పి పంపించేసింది. ఆ తర్వాత తాప్సి పేరు తెరపైకి వచ్చింది. ఈమె నటిస్తే.. అన్ని భాషల్లో సినిమాకు రీచ్ వస్తుంది. బడ్జెట్ పెరిగినా ఫర్వాలేదనుకున్నాడు ఓంకార్. కానీ తాప్సి కూడా నటించడానికి ఒప్పుకోలేదు. ఏవో సాకులు చెప్పి పంపించేసిందట.

కట్ చేస్తే, ఇప్పుడు ఉయ్యాల జంపాల, లక్ష్మీరావే మా ఇంటికి లాంటి సినిమాల్లో నటించిన అవికా గౌర్ ను సంప్రదించాడట ఓంకార్. కాజల్, తమన్న, తాప్సి రేంజ్ నుంచి ఒక్కసారిగా అవికా గౌర్ దగ్గరకు వచ్చి పడ్డాడన్నమాట. ఈమె కూడా ఇంకా అంగీకారం చెప్పలేదు. అవికా కూడా నో చెబితే.. ఇక నందిత శ్వేత, నందిత రాజ్ లాంటి హీరోయిన్లు మాత్రమే మిగులుతారు.

First Published:  8 July 2019 6:40 AM GMT
Next Story