Telugu Global
Cinema & Entertainment

ఓ బేబీ వారాంతం వసూళ్లు

సమంత నటించిన ఓ బేబీ సినిమా సూపర్ హిట్ అయింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా మొదటి రోజు కోటీ 38 లక్షల రూపాయల షేర్ రాబట్టింది. నిన్నటితో 3 రోజుల రన్ పూర్తిచేసుకున్న ఓ బేబీ, తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 4 కోట్ల 75 లక్షల రూపాయల షేర్ రాబట్టింది. మరో 2 కోట్లు వస్తే తెలుగులో ఇది బ్రేక్ ఈవెన్ సాధించినట్టే. ప్రస్తుతం నడుస్తున్న టాక్ చూస్తుంటే.. మరో 2 కోట్లు సంపాదించడం […]

ఓ బేబీ వారాంతం వసూళ్లు
X

సమంత నటించిన ఓ బేబీ సినిమా సూపర్ హిట్ అయింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా మొదటి రోజు కోటీ 38 లక్షల రూపాయల షేర్ రాబట్టింది. నిన్నటితో 3 రోజుల రన్ పూర్తిచేసుకున్న ఓ బేబీ, తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 4 కోట్ల 75 లక్షల రూపాయల షేర్ రాబట్టింది. మరో 2 కోట్లు వస్తే తెలుగులో ఇది బ్రేక్ ఈవెన్ సాధించినట్టే.

ప్రస్తుతం నడుస్తున్న టాక్ చూస్తుంటే.. మరో 2 కోట్లు సంపాదించడం ఓ బేబీకి పెద్ద సమస్య కాదు. లాంగ్ రన్ లో తెలుగు రాష్ట్రాల్లో ఇది 8 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేస్తుందని ఓ అంచనా. వరల్డ్ వైడ్ చూసుకుంటే.. ఈ సినిమాకు 17 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. దీంట్లో 14 కోట్ల రూపాయల గ్రాస్ ఏపీ, తెలంగాణ నుంచే వచ్చింది. ఏపీ,నైజాంలో ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 2.26 కోట్లు
సీడెడ్ – రూ. 0.40 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.69 కోట్లు
ఈస్ట్ – రూ. 0.29 కోట్లు
వెస్ట్ – రూ. 0.24 కోట్లు
గుంటూరు – రూ. 0.33 కోట్లు
నెల్లూరు – రూ. 0.12 కోట్లు
కృష్ణా – రూ. 0.42 కోట్లు

First Published:  8 July 2019 2:53 AM GMT
Next Story